BRS NO CANDIDATES: పైసలు దండగే.. బీఆర్ఎస్‌కి అభ్యర్థులు కరువు.. పోటీకి సిట్టింగ్ ఎంపీలు దూరం..

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం పొడిచేదేముంది. అసలు గెలిచే ఛాన్సుందా..? బీఆర్ఎస్ మీద తెలంగాణలో చాలామందికి ఉన్న ఒపీనియన్ ఇది. జనానికే కాదు.. ఆ పార్టీ నాయకులు కూడా ఇలాగా ఫీల్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 01:16 PM IST

BRS NO CANDIDATES: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు దొరకట్లేదు. బాగా డబ్బులున్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఈసారి పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్. కేంద్రంలో మోడీ మేనియా నడుస్తోంది. ఈ టైమ్‌లో డబ్బులు ఖర్చు పెట్టుకొని నిలబడటం అవసరమా.. సంపాదించుకున్న పైసలన్నీ వదిలించుకోడానికి కాకపోతే.. మాకొద్దు బాబోయ్ టిక్కెట్లు అని గులాబీ బాస్‌కి రిక్వెస్ట్ చేస్తున్నారు.

Pawan Kalyan sold assets : ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కల్యాణ్…. !

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం పొడిచేదేముంది. అసలు గెలిచే ఛాన్సుందా..? బీఆర్ఎస్ మీద తెలంగాణలో చాలామందికి ఉన్న ఒపీనియన్ ఇది. జనానికే కాదు.. ఆ పార్టీ నాయకులు కూడా ఇలాగా ఫీల్ అవుతున్నారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా బాబ్బాబు.. మాకొద్దు.. వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని అంటున్నారట. ఇప్పటికే పార్టీ సమావేశాల్లో.. లోక్‌సభ నియోజకవర్గాల్లో ఫలానా ఆయన నిలబడతారని కొందర్ని అనౌన్స్ కూడా చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. కానీ వాళ్ళెవరూ గులాబీ పార్టీ తరపున పోటీకి సిద్ధంగా లేరు. అసలు అలాంటి ఆలోచనే చేయడం లేదు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములుకే తిరిగి టిక్కెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. కానీ వీళ్ళెవరూ మళ్లీ పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఇప్పుడు కారు పార్టీ తరపున నిలబడి డబ్బులు పోగోట్టుకోవడం కన్నా.. వేరే దారి చూసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారట.

RAHUL GANDHI: రాతెలంగాణ నుంచి రాహుల్ పోటీ.. వయనాడ్ సీటుకు సీపీఐ ఎసరు

కాంగ్రెస్‌లో టిక్కెట్ ఇచ్చినా ఓకే.. లేదంటే కనీసం చేర్చుకున్నా చాలు.. ప్రస్తుతానికి బీఆర్ఎస్ టిక్కెట్ గండం బయటపడతాం అని డిసైడ్ అయిపోయారట. ముఖ్యంగా చేవెళ్ళ రంజిత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. చేవెళ్ళ ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి పోటీ చేసే ఛాన్సుంది. వీళ్ళిద్దరి మధ్యలో నిలబడటం కన్నా.. ప్రస్తుతానికి సైలెంట్ అయితే బెటర్ అని రంజిత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే బీఆర్ఎస్ కూడా అక్కడ వేరే అభ్యర్థి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఇక జహీరాబాద్‌లోనూ బీబీ పాటిల్ ఈసారి బీఆర్ఎస్ నుంచి పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది.

కానీ ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. దాంతో బీబీ పాటిల్ గులాబీకి గుడ్ బై కొట్టి.. కమలం పార్టీలో చేరతారన్న టాక్ కూడా నడుస్తోంది. భారీగా డబ్బులు ఖర్చుపెట్టినా గెలుస్తామన్న గ్యారంటీ లేనప్పుడు.. మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ లీడర్లు. అందుకే పిలిచి ఎంపీ టిక్కెట్ ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు. అటు బీఆర్ఎస్ కూడా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.