BRS-CONGRESS: లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్, బీఎస్పీ కూటమిగా పోటీ చేయబోతున్నాయ్. నాగర్‌కర్నూల్ నుంచి బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ పోటీ చేసే చాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద భారీగా పడేలా కనిపిస్తోంది. పొత్తు ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆదిలాబాద్‌లో కీలక నేతలంతా.. కారుకు, సారుకు బైబై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.
Jr NTR-YSRCP: ఎన్టీఆర్‌ను ఆయుధంగా మార్చుకుంటున్న వైసీపీ.. కొడాలి నాని మాటలకు అర్థం అదేనా..
కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా ఈ లిస్ట్‌లో ఉండడం.. గులాబీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతోంది. వరుస జంపింగ్స్‌తో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్‌కు.. ఇప్పుడీ వ్యవహారం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం అయింది. బీఎస్పీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆయన.. కారు పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారు. సీఎం రేవంత్‌ను కలిసిన కోనప్ప.. పార్టీలో చేరికపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కోనప్ప ఓడిపోయారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా.. తన ప్రత్యర్థిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని కోనప్ప వ్యతిరేకిస్తున్నారు.
తీవ్ర అసంతృప్తితో కోనప్ప.. బీఆరెస్‌కు గుడ్‌బై కొట్టి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక అటు బీఆరెస్‌లో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. బీఎస్పీతో బీఆరెస్ పొత్తు పెట్టుకోవడాన్ని కారణంగా చూపి వారు కారు దిగే ప్రయత్నంలో ఉన్నట్లుగా గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకా హైలైట్ ఏంటంటే.. బీఎస్పీతో పొత్తు వ్యతిరేకిస్తున్న కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి విజయం సాధించి.. గులాబీ గూటికి చేరుకున్నారు.