PADMA RAO: కిషన్ రెడ్డికి పోటీగా పజ్జన్న.. లష్కర్‌పై గురిపెట్టిన బీఆర్ఎస్

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో BRS కు మంచి మెజారిటీ వచ్చింది. మొత్తం 24 స్థానాల్లో 16 సీట్లల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇదే పరిస్థితి లోక్ సభ ఎన్నికల్లోనూ ఉంటుందని గులాబీ బాస్ భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 03:31 PM IST

PADMA RAO: సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారనీ.. రేపో మాపో పజ్జన్న పేరు అనౌన్స్ చేస్తారని అంటున్నారు. పార్టీ నేతలు, అభిమానులు ఇప్పటికే పద్మారావుకు కాంగ్రాట్స్ పజ్జన్న.. అంటూ స్టేటస్ లు కూడా పెట్టుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో BRS కు మంచి మెజారిటీ వచ్చింది. మొత్తం 24 స్థానాల్లో 16 సీట్లల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు.

BRS Krishank: రేవంత్ సోదరుడిపై ఆరోపణలు.. BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై కేసు !

ఇదే పరిస్థితి లోక్ సభ ఎన్నికల్లోనూ ఉంటుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికపై ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. సికింద్రాబాద్ లో మంత్రి కిషన్ రెడ్డికి పోటీగా మళ్ళీ తలసాని కొడుకు సాయికిరణ్ పోటీ చేస్తాడన్న టాక్ నడిచింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను దిగాలని కోరింది. కానీ అందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో మాజీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుకు ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. నగర రాజకీయాలతో పద్మారావుకి 50యేళ్ళుగా అనుబంధం ఉంది. 1973లో కాంగ్రెస్ లో చేరి యువజన కాంగ్రెస్ వివిధ పదవులు నిర్వహించారు. 2001లో కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.

హిస్సాం గంజ్ మోండా మార్కెట్ కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా ఎదిగారు పద్మారావు.. పార్టీలకతీతంగా నేతలందరితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మంత్రి కిషన్ రెడ్డిపై పద్మారావును పోటీకి పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ లేదా బొంతు రామ్మోహన్ ఎవరు నిలబడ్డా… పద్మారావు గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు.