Bheti Subhash Reddy : కారు పార్టీకి షాకిచ్చిన BRS ఎమ్మెల్యే.. బీజేపీలో చేరుతున్నా భేతి సుభాష్‌ రెడ్డి..

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ మారే వాళ్ల సంఖ్య పెరుగుతోది. సొంత పార్టీలో టికెట్‌ రాని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. గెలుపు అవకాశాలను వెతుక్కుంటూ పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు.త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పారు.

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ మారే వాళ్ల సంఖ్య పెరుగుతోది. సొంత పార్టీలో టికెట్‌ రాని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. గెలుపు అవకాశాలను వెతుక్కుంటూ పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో భేతి సుభాష్‌ రెడ్డికి టికెట్‌ దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు సుభాష్‌ రెడ్డి. కొంత కాలం నుంచి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సిట్టింగ్‌లకే టికెట్‌లు కేటాయించిన బీఆర్‌ఎస్‌.. కొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థులను మార్చింది. చాలా కాలం నుంచి ఉప్పల్‌లో భేతి సుభాష్‌ రెడ్డికి స్థానిక కేడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది.

భూకబ్జా ఆరోపణలు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో టికెట్‌ కేటాయించే విషయంలో బీఆర్‌ఎస్‌ వెనకడుగు వేసింది. కేడర్‌లో బలంగా ఉన్నవాళ్లకే టికెట్లు కేటాయిస్తామంటూ బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. ఆ మాట ప్రకారమే కొందరికి టికెట్లు ఇవ్వలేదు. సుభాష్‌ రెడ్డికి కూడా ఈ కారణంగానే టికెట్‌ ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కారు పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీ నుంచి సుభాష్‌కు హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉప్పల్‌ అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు. ఇప్పుడు సుభాష్‌ రెడ్డి రాకతో ఆయననే తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.