BRS MLA’S: టిక్కెట్ల కోసం కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యేలు.. కొందరికి క్లారిటీ

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల మధ్యలో విరామ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలుస్తున్నారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు తమ సీటు గురించి కూడా ఆరా తీస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 09:53 AM IST

BRS MLA’S: ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ నెలకొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఈ నెలలోనే ప్రకటించబోతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫస్ట్ లిస్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు సీటు వస్తుందా.. రాదా.. అనే విషయం తెలుసుకునేందుకు మంత్రి కేటీఆర్ ఛాంబర్ చుట్టూ ఎమ్మెల్యేలు చక్కర్లు కొడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల మధ్యలో విరామ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలుస్తున్నారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు తమ సీటు గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో కేటీఆర్ ఛాంబర్ వద్ద సందడి నెలకొంది. దీంతో కేటీఆర్ కూడా కొందరికి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా టిక్కెట్ విషయంలో కేటీఆర్ స్పష్టతనిచ్చారు. సత్యవతికి డోర్నకల్ లేదా మహబూబాబాద్ సెగ్మెంట్లలో ఎక్కడో ఒక చోటు నుంచే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో తన తండ్రి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను రాజకీయాల్లో నుంచి రిటైర్ కావాలని సత్యవతి ఒప్పిస్తున్నట్లు సమాచారం. రెడ్యా నాయక్ తప్పుకొంటే.. ఆ సీటు సత్యవతికే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అక్కడి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఇటీవల వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. అందుకే ఆయనను ఎమ్మెల్యేగా కాకుండా.. ఎంపీగా పోటీ చేయించాలని హైకమాండ్ భావిస్తోంది. కాగా, మరికొందరు తమకు కాకుండా.. తమ వారసులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, వారసుల విషయంలో అధిష్టానం అంత ఆసక్తిగా లేదని తెలుస్తోంది.
మరోవైపు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టిక్కెట్లు రావని స్పష్టత ఉన్న అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశానికి అన్యమనస్కంగానే హాజరవుతున్నారు. తమకు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అంటూ ఆవేదన చెందుతున్నారు. తుదిజాబితా వచ్చే వరకు ఎమ్మెల్యేలకు ఈ ఉత్కంఠ తప్పదు.