BRS MLAS: తెలంగాణలో నలుగురు BRS ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు వెళ్ళి.. సీఎం రేవంత్‌ను కలిసి బొకే ఇచ్చి మాట్లాడి వచ్చారు. దాంతో ఈ నలుగురు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాము మర్యాద కోసం.. ప్రొటోకాల్ కోసమే కలిశామని ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళు పార్టీ మారడానికే వెళ్ళారు.. అసలు వాళ్ళను పంపిందే మాజీ మంత్రి హరీష్ అని బీజేపీ నేత రఘునందన్ రావు కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. బొకే ఇచ్చి కొద్దిసేపు మాట్లాడి రావడం రెండు పార్టీల్లోనూ కలకలం రేపింది.
UPPAL STADIUM: ఉప్పల్‌లో తిరుగులేని భారత్.. అశ్విన్‌కు ఇక్కడ సూపర్ రికార్డ్..
కొన్ని రోజులుగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. రెండు పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే టైమ్‌లో నలుగురు ఎమ్మెల్యేలు సీఎంని కలవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి.. తమతో టచ్‌లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాము చేర్చుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. ఆ కామెంట్స్‌ను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ.. అసలు రేవంత్ రెడ్డి సర్కారే కొనసాగదనీ.. తొందర్లోనే పడిపోతుందని బీఆర్ఎస్ లీడర్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. కేసీఆరే ప్రభుత్వాన్ని పడగొడతారని బీజేపీ లీడర్లు కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు చూస్తే.. బొటా బొటీ మెజారిటీ ఉన్న కాంగ్రెస్‌లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రెడీ ఉన్నారన్న టాక్స్ నడుస్తున్నాయి.
Pushpa2 The Rule: యాక్షన్ మోడ్.. జపాన్ డాన్‌తో పుష్పరాజ్ భారీ ఫైట్
సిటీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. రేవంత్ సీఎం పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఆయనతో టచ్‌లోకి వెళ్ళారనీ.. అయితే లోక్‌సభ ఎన్నికల దాకా ఆగమని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం పెద్ద రచ్చకు దారితీసింది. వీళ్ళల్లో కొందరికి గతంలో కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. తాము మర్యాద పూర్వంగా కలిశామనీ.. రేవంత్‌తో పాలిటిక్స్‌పై ఎలాంటి చర్చ జరగలేదని మెదక్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. కానీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెర్షన్ వేరేలా ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను మాజీ మంత్రి హరీష్ రావే దగ్గరుండి కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని ఆరోపించారు. హరీష్‌కు తెలియకుండా వాళ్ళు రేవంత్ దగ్గరకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయనీ.. మెదక్ ఎంపీ టిక్కెట్ తనకు కావాలని కవిత కోరుతోందనీ.. అందుకే హరీష్ రావు.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నట్టు రఘునందన్ రావు చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనీ.. ఎంక్వైరీల పేరుతో కేసీఆర్‌తో పాటు అప్పటి మంత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్‌కు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరిన ఈ టైమ్‌లో మెదక్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు అసలు కేసీఆర్, కేటీఆర్‌కు చెప్పే వెళ్ళారా.. అన్న అనుమానాలు రెండు పార్టీల లీడర్లలో వస్తున్నాయి. వీళ్ళిద్దరికీ తెలియకుండానే రేవంత్ ను కలిశారంటే.. నిజంగా రఘునందన్ రావు చెప్పినట్టు హరీష్ రావే వీళ్ళ వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. లేదంటే ఈ నలుగురు కాంగ్రెస్‌లోకి వెళ్ళకుండా వాళ్ళపై ఒత్తిడి తెచ్చారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.