KTR MEETING: కేటీఆర్ మీటింగ్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా.. బీఆర్ఎస్‌లో కలకలం..

భవిష్యత్‌ కార్యచరణ ఏంటో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను పిలిచారు మంత్రి కేటీఆర్‌. బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అంతా మీటింగ్‌కు హాజరయ్యారు. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మాత్రం ఈ మీటింగ్‌కు రాలేదు.

  • Written By:
  • Updated On - December 4, 2023 / 06:37 PM IST

KTR MEETING: తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలి అనుకున్న బీఆర్ఎస్‌ పార్టీకి ప్రజలు షాకిచ్చారు. కారుకు బ్రేక్‌ వేసి.. అధికారాన్ని హస్తానికి అందించారు. అర్బన్‌ ఓటర్లు కాస్త ఆదరించినా.. రూరల్‌ ఓటర్లు మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టారు. వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్టు కాంగ్రెస్‌కు క్లియర్‌ మెజార్టీ ఇచ్చారు. కాంగ్రెస్‌ గెలిచింది. అధికారం చేపట్టబోతోంది. పార్టీలో జరిగిన తప్పులు ఏంటి. భవిష్యత్‌ కార్యచరణ ఏంటో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను పిలిచారు మంత్రి కేటీఆర్‌.

CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్‌.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..

బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అంతా మీటింగ్‌కు హాజరయ్యారు. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మాత్రం ఈ మీటింగ్‌కు రాలేదు. దీంతో బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ముగ్గురు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు టాక్‌ మొదలైంది. వీళ్ల కోసం చాలా సేపు వెయిట్‌ చేసినా మీటింగ్‌కు వీళ్లు ముగ్గురూ వెళ్లలేదట. హాజరు కావడంలేదనే సమాచారం కూడా ఇవ్వకపోవడంతో.. ఇక వీళ్లు పార్టీ వీడబోతున్నారు అని అంతా అనుకున్నారు. వాళ్లు లేకుండానే మీటింగ్‌ కంప్లీట్‌ చేశారు ఎమ్మెల్యే కేటీఆర్‌. అయితే వీళ్లు మీటింగ్‌‌కు రాకపోడానికి రాజకీయ కారణాలు ఏవీ లేవంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. వ్యక్తిగత పనులు ఉన్న కారణంగానే ఈ ముగ్గురూ మీటింగ్‌కు హాజరు కాలేదని చెప్తున్నారు.

వీళ్లు ముగ్గురు మీటింగ్‌కు హాజరు కాలేదని తెలిసి కేసీఆర్‌ వాళ్లను ఫామ్‌‌హౌజ్‌కు పిలిచారట. ఒకవేళ ఏదైనా అసంతృప్తి ఉంటే ముందుగానే చెప్పాలని ముగ్గురికీ కేసీఆర్‌ క్లాస్‌ తీసుకునే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే వీళ్లు పని ఉండి మీటింగ్‌కు రాలేదా.. లేక తెలంగాణ ప్రజలు షాకిచ్చినట్టే వీళ్లు కూడా కారు పార్టీకి షాకివ్వబోతున్నారా అనేది చూడాలి.