BRS SYMBOL: కారును పోలిన గుర్తులు కేటాయించొద్దు.. ఈసీని కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు..

ప్రతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు ఓట్లు గల్లంతు చేస్తున్నాయి. దీంతో ఈ సారి ఆ మిస్టేక్‌ జరగకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను ఇవాళ బీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 03:40 PM IST

BRS SYMBOL: ఎన్నికలు వస్తున్నాయంటే గుర్తుల విషయంలో ఏర్పడే కన్ఫ్యూజన్‌ అంతా ఇంతా కాదు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు కేటాయించే గుర్తులు.. కొన్ని ప్రధాన పార్టీల గుర్తులను పోలి ఉంటాయి. చాలా మంది అవి పార్టీ గుర్తులు అనుకుని వాటికే ఓటు వేస్తుంటారు. ఇలా రాజకీయ పార్టీలు నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ప్రతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు ఓట్లు గల్లంతు చేస్తున్నాయి. దీంతో ఈ సారి ఆ మిస్టేక్‌ జరగకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను ఇవాళ బీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ విన్నవించారు. గత ఎన్నికల్లో ఈ గుర్తుల కారణంగా బీఆర్‌ఎస్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. హుజురాబాద్‌ అసెంబ్లీ బైపోల్‌ సమయంలో కూడా వేల సంఖ్యలో ఓట్లు రోడ్‌ రోలర్‌ గుర్తుకు పడ్డాయి.

రోటీ మేకర్‌ గుర్తు కూడా దాదాపు కారు గుర్తును పోలినట్టుగానే ఉంటుంది. ఇలాంటివి ఈసీ ఎన్నికల గుర్తుల జాబితాలో చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఈ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దు అనేది బీఆర్‌ఎస్‌ ఎంపీల వాదన. వాళ్ల రిక్వెస్ట్‌కు ఈసీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మరి ఎన్నికల్లో ఈ గుర్తులను ఫ్రీజ్‌ చేస్తుందా లేదా చూడాలి.