BRS: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్. కేసీఆర్ నాయకత్వంలో కొద్ది కాలంలోనే ఈ పార్టీ తెలంగాణలో బలంగా తయారయ్యింది. ఆ సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తట్టుకుని ప్రజల్లో నిలబడింది. తెలంగాణ సకల జనుల సహాయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించింది. రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ పార్టీ చేసిన కృషికిగానూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టంకట్టారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవరూ ఊహించని మెజార్టీతో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Congress, CLP : ముగిసిన సీఎల్పీ సమావేశం.. CLP నేత ఎంపికను.. ఏఐసీసీ అప్పగించిన కాంగ్రెస్
వరుసగా పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు తరువాత గులాబీ కండువా కప్పుకున్నారు. దేశ రాజకీయాలను మారుస్తానంటూ టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ మీద ఎంత పట్టు ఉన్నా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకూ బోనీ కొట్టలేకపోయింది. గోషామహల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఒక్క గోషామహల్ తప్పతే మిగిలిన నియోజకవర్గాలు అన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నవే. ఇక ఈసారి ఎన్నికల్లో ఐతే ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్‌కు దక్కలేదు.
ఈ ఎన్నికలు మినహాయిస్తే.. మహేశ్వరం, ఎల్బీనగర్, భద్రాచలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ గెలవలేదు. ఇక్కడ గెలవడం ఇదే మొదటిసారి. కానీ భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ స్థానాల్లో బీఆర్ఎస్ బోణీ కొడుతుందా చూడాలి.