BRS SENTIMENT: సీఎం కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ నే నమ్ముకున్నారు. మూడోసారి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ తో పోకపోతే వర్కవుట్ అయ్యేలా లేదు అనుకుంటున్నారు. అందుకే రెండో దఫా ఎన్నికల ప్రచారంలో మళ్ళా జనంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారింది.. ఇప్పుడు తెలంగాణకే కాదు.. దేశానికి సంబంధించినది అన్న సంగతే మర్చిపోయారు. రాబోయేది ప్రాంతీయ పార్టీల హవా అంటున్నారు కేసీఆర్.
Mallu Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ ప్రజల సంపద దోచుకున్నాయి: సీఎల్పీ నేత
అంతేకాదు… చావు నోట్లో తలకాయ పెట్టా… ఢిల్లీ వాళ్ళు ఎవరు పాలించడానికి మన తెలంగాణాను మనమే పాలించుకుందామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ మాట్లాడుతున్నారు. 2014, 2018 ఈ రెండు సార్లు జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్.. తెలంగాణ వాదాన్నే నమ్ముకుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి తమనే గెలిపించాలని.. రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగింది. ఆ తర్వాత TRS నుంచి బీఆర్ఎస్ కి మారాక… ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో BRS కు అధ్యక్షులను కూడా పెట్టారు. అప్పట్లో రాష్ట్రంలో పాలన మొత్తం వదిలేసి పార్టీ విస్తరణకు కేసీఆర్ టైమ్ కేటాయించారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఒడిశా అధ్యక్షుడు BRS కు రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏపీ ప్రెసిడెంట్ ను ఎన్నికలు అయ్యేదాకా తెలంగాణలో అడుగుపెట్టవద్దని సూచించినట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాది BRS కాదు.. TRS అన్నట్టుగా సీఎం కేసీఆర్ తోపాటు మిగతా నేతల ప్రచారం సాగుతోంది. ఢిల్లీ పాలకులు మనకు అవసరమా.. గుజరాత్ గులామ్ లకు అవకాశం ఇద్దామా అని కేటీఆర్ తరుచుగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్ముదామా.. తెలంగాణ తెచ్చిన పార్టీ BRS ను నమ్ముతారా అని అడుగుతున్నారు.
మరి బీఆర్ఎస్ పెట్టింది ఎందుకు.. అది జాతీయ పార్టీ కదా ? రేపు మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా.. ఇంకో చోట.. ఇంకో చోట.. అక్కడ వీళ్ళు పరాయివాళ్ళు కాదా.. ఈ మధ్య పవన్ కల్యాణ్, చంద్రబాబు మీద కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. దాంతో ఆంధ్రవాళ్ళను ఆడిపోసుకోందే మీకు తెలంగాణలో ఓట్లు పడవా.. అని ఏపీకి చెందిన కొందరు నెటిజెన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో హోరెత్తిస్తోంది. గతంలో వచ్చినంత ఈజీగా ఈసారి అధికారం దక్కుతుందన్న గ్యారంటీ లేదు. దాంతో మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకున్నారు BRS లీడర్లు. ఒకవేళ ఆ మంత్రమే వర్కవుట్ అయ్యి… మళ్ళీ విజయం సాధిస్తే… మిగతా రాష్ట్రాల్లో మళ్ళా జాతీయ పార్టీ పేరుతో వీళ్ళు వెళ్ళగలరా ? లేదంటే జాతీయ పార్టీని మడత పెట్టేసి తెలంగాణకే పరిమితం అవుతారా ? అన్నది చూడాలి.