KTR WRONG ROUTE : రాంగ్ రూట్ లో కేటీఆర్, హరీష్.. ఇలాగైతే పార్టీ మునుగుడే !

తెలంగాణలో BRS పార్టీ రోజు రోజుకీ చతికిలపడుతోంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచిపోతున్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా జంపింగ్ కి రెడీ అవుతున్నారు. వీటికితోడు... బయటపడుతున్న కొత్త స్కామ్స్... కవిత అరెస్ట్ తో దిగజారిన పార్టీ ప్రతిష్ట... ఇవేమీ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పట్టడం లేదా...

తెలంగాణలో BRS పార్టీ రోజు రోజుకీ చతికిలపడుతోంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచిపోతున్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా జంపింగ్ కి రెడీ అవుతున్నారు. వీటికితోడు… బయటపడుతున్న కొత్త స్కామ్స్… కవిత అరెస్ట్ తో దిగజారిన పార్టీ ప్రతిష్ట… ఇవేమీ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పట్టడం లేదా… గత కొన్ని రోజులుగా ఆయన వైఖరి చూస్తే ఇలాగే అనిపిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడం, కాంగ్రెస్ 100 రోజుల పాలనలో హామీలు అమలు కాలేదన్న విమర్శలకే కేటీఆర్ పరిమితం అవుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల సమీక్షల్లో కేటీఆర్ స్పీచ్ కి కేడర్ విసుగెత్తిపోయింది. ఎక్కడికి వెళ్ళినా రొటీన్ డైలాగ్స్. మాజీ మంత్రి హరీష్ రావు పరిస్థితీ అంతే ఉంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి… రేవంత్ రెడ్డి తిట్టడానికే పార్టీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టు అనిపిస్తోంది.

మునిగిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నాలేవీ కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నట్టు కనిపించట్లేదు. అసలు పార్టీలో అంతర్గత సమస్యలపై కేటీఆర్ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా లోక్ సభ నియోజకవర్గాల సమీక్షల్లో ఆ ఏరియాలో తమ బలం ఏంటి… బలహీనతలు ఏంటి… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం పొరపాటు చేశాం… ఇప్పుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలి… ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎలా ఇరుకున పెట్టాలి అన్న దానిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయలేకపోతున్నారు గులాబీ లీడర్లు.

ప్రధాని మోడీని, రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడితే యూట్యూబ్ ఛానెల్స్ లో తంబ్ నెయిల్ పెట్టుకోడానికే తప్ప… కార్యకర్తలకు ఒరిగేది ఏమీలేదన్న విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఛాలెంజ్ గా తీసుకొని ప్రతిపక్ష పాత్రలో మరింత రాణించాల్సింది పోయి … ఆ ఏమైతది అన్న ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై రోజుకో సంచలనం బయటపడుతున్నా… లంగా గాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేంటని… ట్యాపింగ్ చేసినట్టు కేటీఆర్ ఒప్పుకున్నారు. 10యేళ్ళు పాలించిన కేసీఆర్ ని తెలంగాణ జనం వద్దనుకున్నారు… అందుకు కారణాలేంటో సమీక్షించుకోవడం మానేసి… అధికారంలో ఉన్నప్పడి లాగే ఆ ఏమైతది…అనే ధోరణి ఇప్పుడూ కంటిన్యూ చేస్తే… రేపు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేనంతగా BRS దిగజారిపోయే ప్రమాదముంది. రాంగ్ రూట్ లో వెళ్తున్న ఆ ఇద్దర్నీ ఎవరు కరెక్ట్ చేస్తారో చూడాలి.