Pawan Kalyan: పవన్‌కు బీఆర్ఎస్‌ వెయ్యి కోట్ల ప్రచారం.. కథ, స్క్రీన్‌ప్లే అంతా టీడీపీదేనా ?

పవన్ ఎక్కువ సీట్లు అడిగితే.. సీట్ల విషయంలో, అధికారంలోకి వస్తే పదవుల విషయంలో జనసేనను కంట్రోల్ చేయాలంటే ఓ కారణం కావాలి. దాన్ని సాకుగా చూపించి.. జనసేనను తగ్గించాలన్నది టీడీపీ వ్యూహం అని.. అందుకే అనుకూల మీడియా నుంచి ఇలాంటి ప్రచారం చంద్రబాబు చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - March 6, 2023 / 07:22 PM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ వెయ్యికోట్లు ఆఫర్ చేశారనే ప్రచారం.. ఏపీ రాజకీయాల్లో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. అటు జనసేన నుంచి.. ఇటు గులాబీ పార్టీ నుంచి ఖండనలు వినిపించినా.. సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ అని రాజకీయం అనుమాన పడుతూనే ఉంది ఇంకా ! ఇలాంటి ప్రచారం ఎవరు చేసినా పెద్ద మ్యాటర్‌ కాకపోయేది.. టీడీపీ అనుకూల మీడియా నుంచి కథనాలు రావడం.. కొత్త చర్చకు కారణం అయింది. చంద్రబాబు అనుమతి లేకుండా ఇలాంటి రాతలు వచ్చే అవకాశమే లేదు అనేది మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఈ ప్రచారం వెనక కథ, స్క్రీన్‌ ప్లే అంతా.. టీడీపీదే అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.

ఎందుకు అంటే.. రెండు కారణాలు చెప్తున్నారు చాలామంది ! చివరి నిమిషంలో జనసేన హ్యాండ్ ఇస్తుందన్న అనుమానంతోనే ఇలా చేశారని కొందరు అంటుంటే.. పొత్తు కుదిరినా పవన్‌ను కంట్రోల్‌లో పెట్టేందుకే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారన్నది మరికొంత మంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. గత ఎన్నికలతో పోలిస్తే జనసేన భారీగా బలం పుంజుకుంది. ప్రతీ విషయంలో ఎప్పుడూ లేనంత యాక్టివ్‌గా కనిపిస్తోంది. అన్నింటికి మించి.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉండాలన్నది డిసైడ్‌ చేయబోయేది తామే అనే క్లారిటీకి వచ్చింది జనసేన ! దీంతో గౌరవప్రదమైన పొత్తుతో పాటు డిప్యూటీ సీఎం పదవిని పవన్‌ ఆశించే అవకాశాలు లేకపోలేదు. ఐతే అదే పదవి కోసం లోకేశ్‌ కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కాన్ఫిడెన్స్‌పై దెబ్బ తీస్తే.. పరిస్థితి చేతుల్లోకి వస్తుందని భావించి.. వెయ్యి కోట్ల ప్రచారం టీడీపీ మొదలు పెట్టిందనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.

వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరితే.. తక్కువలో తక్కువ 50స్థానాలు డిమాండ్‌ చేయాలని జనసేన, పవన్ భావిస్తున్నారు. ఐతే టీడీపీ మాత్రం.. పవన్‌కు 15 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐతే ఇలాంటి ప్రచారాలు క్రియేట్ చేయడం ద్వారా.. జనసేనను ఒకరంగా కార్నర్‌ చేసి.. ఆ పార్టీ డిమాండ్‌ తగ్గించాలన్న వ్యూహం కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన కామన్ లక్ష్యం ఒక్కటే.. అదే జగన్‌ను ఓడించడం ! దీనికోసం పొత్తు తప్పదు. పవన్ ఎక్కువ సీట్లు అడిగితే.. సీట్ల విషయంలో, అధికారంలోకి వస్తే పదవుల విషయంలో జనసేనను కంట్రోల్ చేయాలంటే ఓ కారణం కావాలి. దాన్ని సాకుగా చూపించి.. జనసేనను తగ్గించాలన్నది టీడీపీ వ్యూహం అని.. అందుకే అనుకూల మీడియా నుంచి ఇలాంటి ప్రచారం చంద్రబాబు చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.