KCR Big Plan : 2లక్షల మందితో బీఆర్ఎస్ సభ.. కాంగ్రెస్ టార్గెట్ గా గులాబీ బాస్ ప్లాన్

ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) ముంచుకొస్తున్నాయి... మరోవైపు బీఆర్ఎస్ పై... కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు BRS అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్లగొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.

ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) ముంచుకొస్తున్నాయి… మరోవైపు బీఆర్ఎస్ పై… కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు BRS అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్లగొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అంతకుముందు ఈ మీటింగ్ వరంగల్ లో పెట్టాలనుకున్నారు. కానీ కృష్ణానదీ జలాల ప్రాజెక్టులను KRMBకి ప్రభుత్వం అప్పగించిందని ఆరోపణులు చేస్తోంది బీఆర్ఎస్. ఈ ఇష్యూని హైలెట్ చేయడానికి కృష్ణా పరివాహక ప్రాంతమైన నల్లగొండ జిల్లాను ఎంచుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)అధికారంలోకి వచ్చాక… అనుకోకుండా కేసీఆర్ కిందపడటం…అనారోగ్యం పాలవడంతో ఆరోపణలను సమర్థంగా బీఆర్ఎస్ తప్పికొట్టలేకపోతోంది. కేటీఆర్, హరీష్ రావు మాట్లాడతున్నా…కేసీఆర్ (KCR) యాక్టివ్ గా లేరన్న బెంగ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి, మేడిగడ్డ రిజర్వాయర్ (Medigadda Reservoir) అక్రమాలపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కృష్ణా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్వంలోని KRMB అప్పగించడంపై వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే అప్పగింత జరిగిందని… సీఎం రేవంత్ ఆధారాలు, లెటర్లతో సహా చూపిస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు సిద్దమని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కూడా స్పందించారు.

నల్లగొండ సభ ద్వారా తాము కృష్ణా జలాల కోసం ఎప్పటి నుంచి… ఎలా కొట్లాడామో శ్వేతపత్రం రిలీజ్ చేసి కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టాలని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. నాగార్జున సాగర్ ను అప్పగించడం ద్వారా కలిగే నష్టాలను పాంప్లేట్స్ ద్వారా జనానికి తెలియజేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, ఎంతవేరకు నెరవేరాయి… విద్యుత్ సరఫరాలో ఆటంకాలులాంటి అంశాలను ఈ సభలో ప్రస్తావించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు (Rythu Bandhu) అందట్లేదనీ వరికి 500 రూపాయల బోనస్ లాంటి హామీలు నెరవేరలేనది బీఆర్ఎస్ (BRS) ఫోకస్ చేయబోతోంది. సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోవడంతో… చివరి ఆయకట్టుకు నీళ్ళు అందక పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అంటోంది. ఈ మీటింగ్ తో పార్లమెంట్ ఎన్నికలకు కూడా కేడర్ ను రెడీ చేసినట్టు అవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఓటమి నుంచి కార్యకర్తలు, నేతలను బయటకు తీసుకురావడానికీ… ప్రభుత్వంపై పోరాటానికీ… ఈ నల్లగొండ సభ ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి.