BRS MP SEATS: కారు తిరుగుతుందా..? కారుకు పొంచి ఉన్న మరో గండం..

2024 ఏప్రిల్‌లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో పాటు.. కమలం పార్టీని కూడా బీఆర్ఎస్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దాంతో ఆ పార్టీ ఓట్లు 13.9శాతానికి పెరిగాయి.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 01:41 PM IST

BRS MP SEATS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు పంక్చరైంది. పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను జనం తిప్పికొట్టారు. అసెంబ్లీ సంగతి సరే.. మరి రాబోయే లోక్ సభ ఎన్నికల మాటేంటి..? గతంలో అధికారం ఉంది కాబట్టి.. కారు.. సారు.. పదహారు నినాదం ఎత్తుకున్నారు. ఈసారి ఏమని చెప్పుకుంటారు. నెక్ట్స్ ఎలక్షన్స్‌లో గులాబీ పార్టీకి కాంగ్రెస్‌తోనే కాదు.. బీజేపీతోనూ గండం పొంచి ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతింది. మరోవైపు ఊహించని విధంగా సీట్లు, ఓట్ల శాతం పెంచుకుంది బీజేపీ. 2024 ఏప్రిల్‌లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో పాటు.. కమలం పార్టీని కూడా బీఆర్ఎస్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దాంతో ఆ పార్టీ ఓట్లు 13.9శాతానికి పెరిగాయి.

TELANGANA ASSEMBLY: వాళ్లే ఎక్కువ.. ఆ సామాజికవర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు..

అలాగే గతంలో ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉంటే.. ఇప్పుడు 8 మందికి బలం పెరిగింది. ఎన్నికల ముందు బండి సంజయ్‌ను తప్పించి.. కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఓ రకంగా అధిష్టానం మిస్టేక్ చేసిందన్న వాదనలు వచ్చాయి. అయినప్పటికీ.. కమలం పార్టీ 20 వేల నుంచి లక్ష ఓట్లు దాకా పొందిన నియోజకవర్గాలు 58 దాకా ఉన్నాయి. అలాగే 10 వేల నుంచి 20 వేల మధ్య ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 25 దాకా ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే.. బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే.. ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్‌కి 9 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2024లో ఈ 9 సీట్లు నిలబెట్టుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఈ ఎంపీ సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో.. కేవలం మూడింటిలో మాత్రమే బీఆర్ఎస్ తన ప్రభావం చూపించింది. కానీ లోక్ సభ ఎన్నికల ఎజెండా వేరే ఉంటుంది. మోడీ మేనియా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గతంలో 2019లోనూ ఇదే జరిగింది. 2018 ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ.. 2019 లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో.. గతంలో 3 ఎంపీ స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. కానీ ఈసారి 10 లోక్‌సభ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో హస్తం పార్టీ భారీ మెజారిటీలు సాధించింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కనీసం 8 ఎంపీ స్థానాలనైనా ఆ పార్టీ గెలుచుకునే అవకాశముంది. ఇక బీజేపీ సంగతి చూస్తే.. 2 లోక్ సభ స్థానాల పరిధిలో బీజేపీకి 6 అసెంబ్లీ సీట్లు దక్కాయి. గతంలో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకున్నా.. వాటిల్లో ఒక్క చోట మాత్రమే ఆధిక్యం కనబరిచింది. ఆదిలాబాద్ ఎంపీ సీటు బీజేపీదే. ఇక్కడ నాలుగు అసెంబ్లీ స్థానాలు కమలం పార్టీకి దక్కాయి. దీనికి తోడు మోడీ మేనియా పనిచేస్తే.. గతంలో లాగా నాలుగు ఎంపీ సీట్లు దక్కవచ్చు. లేదంటే ఇప్పుడు పెరిగిన ఓట్ల శాతం చూస్తే.. ఇంకా పార్లమెంట్ స్థానాలు కమలం పార్టీ ఖాతాలో పడవచ్చు. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటు పరిధిలో.. అసెంబ్లీ సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఈ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌కి దక్కలేదు. ఇక్కడ మొత్తం 7 స్థానాల్లోనూ కారు పార్టీయే విజయం సాధించింది.

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే.. ఏపీలో ఎందుకు ఉలికిపాటు..?

చేవెళ్ళ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. నాలుగు బీఆర్ఎస్‌కు, మూడు కాంగ్రెస్‌కు దక్కాయి. మెదక్ ఎంపీ స్థానం పరిధిలో కూడా ఒక్కటి తప్ప మిగిలిన సీట్లు కారు పార్టీకే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కారు పార్టీ.. మరో నాలుగు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఎలా పుంజుకుంటుంది..? పాత వైభవం రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారు..? మహారాష్ట్ర, ఒడిశా, ఏపీల్లో అడుగుపెట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనే సరిగా లేదు.. మిగతా రాష్ట్రాలు ఆదరిస్తాయా.. ఆయా రాష్ట్రాల్లో గులాబీ పార్టీలో చేరిన నేతల్లో కొందరు వేరే పార్టీల్లో చేరిపోయారు. మిగిలిన వాళ్ళయినా కంటిన్యూ అవుతారా అన్నది చూడాలి. ఏదేమైనా లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఛాలెంజ్‌గా మారబోతున్నాయి.