CM RAMESH: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేసింది వైసీపీ. మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే మాడుగుల ముత్యాలనాయుడికి.. అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించింది. ఆయన కూతురు ఈర్లి అనురాధకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అనకాపల్లిలో కూటమి తరఫున సీఎం రమేష్ బరిలో దిగుతుండగా.. ముత్యాల నాయుడు పేరును జగన్ ఎందుకు ప్రకటించారనే చర్చ జరుగుతోంది. 175 అసెంబ్లీ.. 24పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అనకాపల్లిని ఆ టైమ్‌లో పెండింగ్‌లో పెట్టింది.
Raja Singh Lodh: అలక వీడని రాజాసింగ్.. పార్టీకి దూరం..
పెండింగ్‌కు కారణం మాత్రం చెప్పలేదు. దీంతో జగన్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారా అని జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఐతే ఎట్టకేలకు అనకాపల్లి వ్యవహారంలో సస్పెన్స్ వీడింది. ముత్యాల నాయుడుని సెలక్ట్ చేయడం వెనక.. జగన్ భారీ వ్యూహం కనిపిస్తోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సీఎం రమేష్ బరిలో ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆర్థికంగా ఆయన చాలా స్ట్రాంగ్. పైగా మూడు పార్టీలు కూడా కలిశాయ్. దీంతో అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే.. ఇంకా బలమైన క్యాండిడేట్ కావాలి. దీంతో ఆ సమయంలో అనకాపల్లిని హోల్డ్‌లో పెట్టిన జగన్.. ఇప్పుడు ముత్యాలనాయుడుకి అవకాశం ఇచ్చారు. మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో డబ్బు ప్రభావం తక్కువగా ఉంటుంది. ఐతే రాయలసీమ నేత అయిన సీఎం రమేష్.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి దిగుమతి అయ్యారు.
ఆయనతో పోటీ పడి ఆ రేంజ్‌లో ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు. అందుకే ఆర్థికంగా, సామాజికవర్గంవారీగా బలంగా ఉన్న ముత్యాలనాయుడుకు జగన్ అవకాశం కల్పించారు. ముత్యాలనాయుడు.. అనకాపల్లి జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. ఇది కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారు. అనకాపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం రమేష్‌కు చాన్స్ ఇవ్వొద్దని జగన్ భారీ వ్యూహం సిద్ధం చేశారు. ప్రచారంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నారు.