బన్నీ బెయిల్‌ ఖర్చు రూ.4 కోట్లు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌, బెయిల్‌ ఇప్పుడు స్టేట్‌వైడ్‌గా హాట్‌ టాపిక్‌. ఎంత వేగంగా పోలీసులు అరెస్ట్‌ చేశారో అంతే వేగంగా బన్నీ బెయిల్‌ తెచ్చుకున్నాడు. అయితే ఈ బెయిల్‌ కోసం బన్నీ దాదాపు 4 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌ 13 మధ్యాహ్నం 12 గంటలకు బన్నీ అరెస్టయ్యాడు.

  • Written By:
  • Publish Date - December 14, 2024 / 07:05 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌, బెయిల్‌ ఇప్పుడు స్టేట్‌వైడ్‌గా హాట్‌ టాపిక్‌. ఎంత వేగంగా పోలీసులు అరెస్ట్‌ చేశారో అంతే వేగంగా బన్నీ బెయిల్‌ తెచ్చుకున్నాడు. అయితే ఈ బెయిల్‌ కోసం బన్నీ దాదాపు 4 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌ 13 మధ్యాహ్నం 12 గంటలకు బన్నీ అరెస్టయ్యాడు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వరకు పాకిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోని అరెస్ట్ చేయడం పై ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపిన అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. అల్లు అర్జున్ న్యాయవాది బెయిల్ కావాలి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచికత్తు పైన హైకోర్టు ధర్మాసనం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ వచ్చిన సరే అల్లు అర్జున్‌ను రాత్రంతా చంచల్‌గూడా జైల్‌లోనే ఉంచారు పోలీసులు. జైలు నుంచి ఈ రోజు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్‌కు నిన్న ఒక్క రోజే బెయిల్‌ కోసం 3 నుంచి 4 కోట్లు ఖర్చు అయిందట.

అల్లు అర్జున్ తరఫున కోర్టులో కేసు వాదించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గంట కోసం పెద్ద మొత్తంలో తీసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఆయన సిబ్బంది దాదాపు 20 మందికి సపరేట్ ఖర్చు. అలాగే ఇతర ఖర్చలు అన్ని కలిపి నిన్న ఒక్క రోజే దాదాపు 4 కోట్లు ఖర్చు చేశాడని టాక్. అయితే ఒక్క రోజుకే అంత ఖర్చు పెట్టారు కానీ ఫైనల్‌గా మధ్యంతర బెయిల్‌పై వచ్చాడు. ఏది ఏమైనా నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ పైన వచ్చిన బన్నీకి మళ్లీ కోర్టు ఎలాంటి షాక్ ఇస్తుందో అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 బెనిఫిట్‌ షో డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో వేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ ర్యాలీ వెళ్లారు. అక్కడ బన్నీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అందులో భాగంగానే తొక్కిసలాట జరిగింది. అదే తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కొడుకు ప్రస్తుతం మృత్యువుతో పోరాడి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్‌పై కేసు ఫైల్ అయింది.