క్యాపిటల్ లోడింగ్, మళ్ళీ పనులు స్టార్ట్

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులకు సీఎం చంద్రబాబు తిరిగి శ్రీకారం చుట్టారు. రాయపూడికి చేరుకున్న సీఎం... పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం అయిందని ప్రభుత్వం ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - October 19, 2024 / 01:14 PM IST

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులకు సీఎం చంద్రబాబు తిరిగి శ్రీకారం చుట్టారు. రాయపూడికి చేరుకున్న సీఎం… పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం అయిందని ప్రభుత్వం ప్రకటించింది. గత అయిదేళ్లుగా పనులు ముందుకు వెళ్ళలేదు అనే సంగతి తెలిసిందే. విశాఖలో రాజధాని అని అప్పటి సిఎం జగన్ ప్రకటించడంతో అమరావతి పనులను నిలిపివేశారు.

80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను తాజాగా చంద్రబాబు ప్రారంభించారు. రూ.160 కోట్లతో 7 అంతస్తుల్లో 2018 లో కార్యాలయ పనులను చేపట్టారు. ఇటీవల జరిగిన సీఆర్దీఎ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించిన అనంతరం పనులకు శ్రీకారం చుట్టారు.