Chakradhar Goud Joins In BJP: బీజేపీలో చేరిన చక్రధర్‌ గౌడ్‌.. సిద్ధిపేట్‌లో హీటెక్కిన పాలిటిక్స్‌..

సిద్ధిపేట జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి హరీష్‌ రావుకు వ్యతిరేకంగా ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండర్‌ చక్రధర్‌ గౌడ్‌ బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చక్రధర్‌ గౌడ్‌ను హరీష్‌ రావుపై పోటీకి దింపే ఆలోచనలో బీజేపీ హై-కమాండ్‌ ఉన్నట్టు సమాచారం.

సిద్ధిపేట జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి హరీష్‌ రావుకు వ్యతిరేకంగా ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండర్‌ చక్రధర్‌ గౌడ్‌ బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చక్రధర్‌ గౌడ్‌ను హరీష్‌ రావుపై పోటీకి దింపే ఆలోచనలో బీజేపీ హై-కమాండ్‌ ఉన్నట్టు సమాచారం. చక్రధర్‌ గౌడ్‌ తనపై అత్యాచారయత్నం చేశాడంటూ కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే పోలీసులు చక్రధర్‌ను అరెస్ట్‌ చేశారు. అప్పట్లో ఈయన అరెస్ట్‌ తెలంగాణలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. మంత్రి హరీష్‌ రావు ఉద్దేశపూర్వకంగా చక్రధర్‌ గౌడ్‌ను అరెస్ట్‌ చేయించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. భవిష్యత్తులో చక్రధర్‌ గౌడ్‌ తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారే అవకాశం ఉండటంతో.. కక్షసాధింపు చర్యకు పాల్పడ్డాడంటూ మండిపడ్డాయి. అటు చక్రధర్‌ అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా రోడ్డేక్కారు. డబ్బుకు ఆశపడి ఆయన చిన్ననాటి స్నేహితుడే అతని భార్యతో తప్పుడు కేసు పెట్టించాడని చక్రధర్‌ భార్య సాక్ష్యాలు కూడా చూపించారు. దీంతో మంత్రి హరీష్‌ రావు ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తమకు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్‌ లేదని అప్పట్లో చక్రధర్‌ భార్య క్లారిటీ ఇచ్చారు. కానీ ఈటెల రాజేందర్‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ విషయం ఇప్పుడు సిద్ధిపేట రాజకీయాల్లో సంచలనంగా మారింది. హుజురాబాద్‌ బైపోల్‌ సమయంలో మంత్రి హరీష్‌ రావు స్వయంగా వచ్చి ఈటెలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈటెలను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్య విజయం సాధించిన ఈటెల.. హరీష్‌ రావుపై రివేంజ్‌ తీర్చుకునేందుకు ఇప్పుడు చక్రధర్‌ను బరిలో దింపబోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన అందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తాను ప్రచారం నిర్వహిస్తానని అప్పట్లో ఈటెల చెప్పారు. ఇప్పుడు అందులో భాగంగానే స్వయంగా తానే చక్రధర్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. చక్రధర్‌కు మద్దతుగా వచ్చే ఎన్నికల్లో ఈటెల ప్రచారం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట. ఇదే జరిగితే రానున్న జనరల్‌ ఎలక్షన్స్‌లో సిద్ధిపేట్‌లో పొలిటిక్‌ హీట్‌ తీవ్రంగా ఉంటుంది.