ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణలో టీడీపీ ఏ స్థాయికి వెళ్లిందో సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు అధికారం చేపట్టిన పార్టీకి తరువాత కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఆంధ్రాలో ఒక టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేసినా.. తరవాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ వీక్ అయ్యింది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో వైసీపీ చేసిన తప్పుల కారణంగా గత ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది.
అలా ఏపీలో అధికారం చేపట్టారో లేదో.. ఇలా మళ్లీ తెలంగాణ ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలపెట్టారు చంద్రబాబు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించారు. తెలంగాణలో పార్టీ మళ్లీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే పార్టీకి తెలంగాణ అధ్యక్షున్ని కూడా నియమిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో అవే టార్గెట్‌గా పార్టీని మళ్లీ లైన్‌లోకి తీసుకువారావాలనేది చంద్రబాబు పాయింట్.
ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలే టార్గెట్‌గా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. చాలా కాలం నుంచి తెలంగాణలో టీడీపీ ఫాంలో లేని కారణంగా పాత కమిటీలను రద్దు చేస్తున్నట్టు చప్పారు. వాటి స్థానంలో కొత్త కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సారి కమిటీలో యువతకు, బీసీలకు భారీ ప్రియార్టీ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వం విషయంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. టీడీపీ రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి రేవంత్‌తో తాను భేటీ అవుతానని చెప్పారు చంద్రబాబు. తెలంగాణలో కూడా పార్టీని అగ్ర స్థానానికి తీసుకురావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.