సోషల్ మీడియా లో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ సిఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేసారు. సోషల్ మీడియా లో ఆడబిడ్డల మీదఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆడబిడ్డ హోంమంత్రి పైన పోస్ట్ లు పెడుతున్నారన్నారు. అబోతుల మదిరిగా మారారు…. మదమెక్కి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరకు పవన్ కళ్యాణ్ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడుతున్న పరిస్థితి తెచ్చారన్నారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా వద్ద అన్న సిఎం చంద్రబాబు ప్రశ్నకు… అలాంటి వారిపై చర్యలు సబబే అంటూ సమాధానం ఇచ్చారు ప్రజలు. గతం లో వివేకా ను హత్య చేసి గుండెపోటు అంటే మొదట నేనుకూడా నమ్మానని… పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అని తేలిందన్నారు. తరువాత ఆ హత్యను నా మీద నెట్టే ప్రయత్నం చేశారన్నారు. అత్యాచారాలు చేస్తున్న వారిని ఏమి చేయాలి, ఆలోచిస్తున్నమని తెలిపారు.
పోలీసులు ఒక సారి ఆలోచించుకోవాలి, పోలీసు లు అప్పర్ హాండ్ తో వుండాలని సూచించారు. నేరస్తులది అప్పర్ హ్యాండ్ వుంటే మంచిది కాదన్నారు. వైసిపి నాయకులు తీరు మార్చుకోవాలి లేకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరిస్తారు. రాజకీయాలు రాజకీయంగా చేస్తే సరే… ఆడబిడ్డల జోలికి వస్తే సహించనన్నారు. ఇప్పుడు ఈ అంశాలు చెప్పక పోతే నేను డిఫాల్టర్ గా మరుతానని తెలిపారు. అందుకే ఇప్పుడు చెప్పక తప్పలేదన్నారు.