CHANDRABABU NAIDU: వైఎస్ జగన్ బీసీల గురించి ఆలోచిస్తే.. పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. ”జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరక్కొడుతుంది. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునుగుతుంది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో తెలీదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటున్నారు.
REVANTH REDDY: ఇది సార్ రేవంత్ రేంజ్.. ట్రాఫిక్‌లోనే రేవంత్.. సీఎం సంచలన నిర్ణయం..
అపరిచితుడు లాంటి జగన్ చెప్పిందేదీ చేయడు. తల్లీ, చెల్లికి కూడా సమయo ఇవ్వని జగన్ ఇక ఎమ్మెల్యేలకేం ఇస్తాడు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలి పెట్టాడు. పులివెందులలో ఒక బీసీని గెలిపించి తన సత్తా ఏంటో జగన్ చూపించాలి. జగన్ ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయొచ్చు. వైసీపీలో ఎమ్మెల్యేలు మాట్లాడలేరు. వైసీపీ ఎంపీలు గుమాస్తాలు. 151 మందిని మార్చినా జగన్ గెలవడు. రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అన్ని సంప్రదాయాలను సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎంత మందిని మార్చినా వైసీపీని ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. బీసీని గెలిపించాలంటే జగన్ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందుల. ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు ఎవరి జీవన ప్రమాణాలు అయినా మారాయా అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. డీఎస్సీ పెట్టి ఒక్క టీచర్‌కి కూడా ఉద్యోగం ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని జగన్ ఎలా చెప్తాడు. ఈ ముఖ్యమంత్రి యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ, వారికి గంజాయి మాత్రం ఇస్తున్నాడు.
రాష్ట్రంలో ఘనంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమే. జగన్ దుర్మార్గుడు. 2004లో సీఎం కాకపోవడంతో హైదరాబాద్ బతికిపోయింది. జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు నయం. అందుకే హైదరాబాద్ అభివృద్ధిని నాశనం చేయలేదు. వికృతమైన క్రీడలతో ఆంధ్రాని జగన్ అడిస్తున్నాడు. పద్ధతిలేని రాజకీయాలతో ఏపీని రాజధాని లేని రాష్ట్రం చేశాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుస్తాం. పరదాలు, పోలీసుల సాయం లేకుండా బయటకు రాలేని దుస్థితి జగన్‌ది. డిసెంబర్ 20 తర్వాత 25 నియోజకవర్గాల్లో పర్యటించి, వచ్చే 5 ఏళ్లల్లో ఏం చేస్తామో చెప్తా. సైకో జగన్‌ను చిత్తు చిత్తుగా ఒడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు” అని చంద్రబాబు అన్నారు.