CHANDRABABU NAIDU: ఏపీ సచివాలయం తాకట్టు.. జగన్‌పై చంద్రబాబు విమర్శలు

సీఎం జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇది ఏపీకి ఎంతో అవమానకరం.. బాధాకరం అన్నారు. ఈ అంశంపై చంద్రబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు.

  • Written By:
  • Updated On - March 3, 2024 / 02:58 PM IST

CHANDRABABU NAIDU: ఏపీ సచివాలయాన్ని జగన్ ప్రభుత్వం తాకట్టుపెట్టినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. రూ. 370 కోట్ల రుణం కోసం సచివాలయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఆదివారం ఒక ప్రముఖ పత్రికలో వార్తా కథనం ప్రచురితం అయింది. దీనిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

Rishabh Pant: పంత్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆరోజే.. వికెట్ కీపర్ రీఎంట్రీపై దాదా కీలక వ్యాఖ్యలు

ఇది ఏపీకి ఎంతో అవమానకరం.. బాధాకరం అన్నారు. ఈ అంశంపై చంద్రబాబు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ‘‘రాష్ట్రానికి ఎంత అవమానకరం.. ఎంత బాధాకరం.. ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా.. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!’’ అని చంద్రబాబు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు నారా లోకేష్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీని అప్పులకుప్పగా మార్చిన జగన్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా తయారు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. ఈ సీఎంను ఏమనాలో.. ఎవరితో పోల్చాలో కూడా మాటలు రావడం లేదన్నారు.