చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే భారతదేశంలో ఎవరైనా ఆయన గొప్ప వ్యూహకర్త, రాజకీయ మేధావి అని చెప్తారు. కానీ ఎంత వ్యూహకర్తలైన, మేధావులైన ఒక్కోసారి బొక్క బోర్లా పడతారు అనడానికి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారమే ఒక ఉదాహరణ. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డుపై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలు
చంద్రబాబు నాయుడు లేకితనాన్ని, రాజకీయం కోసం దేనికైనా తెగిస్తారన్న విషయాన్ని బయటపెట్టింది. లడ్డూలో కల్తీ ఉందో లేదో చూసుకోకుండానే దేశం మొత్తం చంద్రబాబు చేసిన ప్రచారం తిరుమల పరువు ని, ఆంధ్రప్రదేశ్ పరువుని బజార్లో పెట్టాయి.
సుబ్రహ్మణ్యస్వామి, వై వి సుబ్బారెడ్డి తో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లపై వాదనల సందర్భంగా న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సూచనలు, అన్న మాటలు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం వెనక ఉన్న కుటిల రాజకీయాలను చెప్పకనే చెప్పింది. న్యాయమూర్తి ప్రశ్నలకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానాలు చెప్పలేకపోవడం బట్టి ఏ ఆధారాలు లేకుండా ఈ వివాదాన్ని చంద్రబాబు ఎలా సృష్టించారో, దానిని అడ్డంపెట్టి పవన్ కళ్యాణ్ జనాన్ని ఎలా రెచ్చగొట్టారో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి, టీటీడీ ఈవో ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అనే విషయం కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. నెయ్యి క్వాలిటీపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? మైసూర్ లో లేదా ఘజియాబాద్ లో ఉన్న ల్యాబ్ లకు నెయ్యి టెస్ట్ కోసం ఎందుకు పంపలేదు? అని కోర్టు ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగినట్లు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా…? ఏ ఆధారాలతో సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో కల్తీ ఉందని చెప్పారు అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి సమాధానం లేదు.
లడ్డు లో నెయ్యి కల్తీ కి సంబంధించి ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని కోర్టు చంద్రబాబు నాయుడిని నేరుగా ప్రశ్నించింది. నెయ్యిలో కల్తీ జరిగిందంటున్నారు… ఆ నెయ్యి లడ్డు తయారీ కి వినియోగించారా లేదా? ఆ లడ్డు లు ఎవరు తిన్నారు? ఆ లడ్డుల ని ఎందుకు పరీక్ష చేయించలేదు ఇలా కోర్టు వేసిన ఎన్నో ప్రశ్నలు లడ్డు కల్తీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారాన్ని చెప్పకనే చెబుతున్నాయి. నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు…. ఆ టాంకర్లను వెనక్కి పంపారు… మరి అలాంటప్పుడు ఆ నెయ్యి లడ్డూలో ఎలా కలుస్తుంది? అన్న న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానం లేదు. ఏ ఆధారాలతో లడ్డు లో కల్తీ ఉందని, జంతువుల కొవ్వు ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు అనే ప్రశ్నకు ఎవరి నుంచి సమాధానం లేదు. దేవుడు చుట్టూ దయచేసి రాజకీయాలు చేయకండి అంటూ సుప్రీంకోర్టు… లీడర్లకు చురకలు వేసిందంటే… ఈ కేసులో చంద్రబాబు తెర వెనక ఎంత డ్రామా చేశారో అర్థమవుతుంది. లడ్డు ప్రసాదం కల్తీపై రాజకీయ జోక్యాన్ని అనుమతించాలా? బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారు అంటూ న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు ఇప్పుడు చాలామందిలో ఆలోచనలు రేపుతున్నాయి. కనీసం నెయ్యి క్వాలిటీ రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు, ఎన్ డి డి బి రిపోర్టులో ఉన్నవి సూచనల? తుది అంశాల? అన్నది తేల్చలేదు ఇలా ఎన్నో విషయాలను జస్టిస్ రామకృష్ణ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ నిలదీశారు.
చంద్రబాబు నాయుడు చేసిన దుందుడుకు పని…. దేశంలో జనం మనోభావాలను ఎలా దెబ్బతీసిందో అర్థమవుతుంది. జూలై 23న నెయ్యి కల్తీపై నివేదికొస్తే రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి స్వయంగా లడ్డులో కల్తీ జరిగిందని…. అది జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణమని దేశమంతా ప్రచారం చేశారు. సామాజిక వర్గం మీడియా అడ్డం పెట్టి అల్లకల్లోలం చేసింది. ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రెండు నెలల తర్వాత లేపిన గబ్బని అర్థం అయిపోతుంది. గడచిన వంద రోజుల్లో వారానికో సబ్జెక్టు తీసుకుని ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయంగా కుల్లబొడిచిన చంద్రబాబు, లడ్డు విషయంలో మాత్రం పప్పులో కాలేశారు.. వెనక ముందు చూసుకోకుండా తాను ఏం మాట్లాడితే అది జనం నమ్ముతారని ఏకంగా తిరుమల లడ్డులోనే కల్తీ జరిగిందని… ముసలి కన్నీరు కార్చారు. ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టు కి వెళ్లేసరికి… ఏం చేయాలో పాలుపోవడం లేదు. సుప్రీంకోర్టు అడిగిన లాజికల్ ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు.
లడ్డుని ఎందుకు పరీక్ష చేయించలేదు? లడ్డు కల్తీ జరిగిందా లేదా? నెయ్యి శాంపిల్ తీసి ట్యాంకర్ ని వెనక్కి పంపించినప్పుడు ,ఆ నెయ్యిని వాడనప్పుడు… లడ్డు కల్తీ జరిగినట్టు మీరు ఎలా ఆరోపించారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి చవక బారు ఆరోపణలు చేయొచ్చా? దేవుడు చుట్టూ రాజకీయాలు చేయడం సబబేనా? ఈ ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు వేసింది చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కే. ముఖ్యమంత్రి కి వచ్చిన సమాచారం మేరకే ఆయన మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ తిరుపతిలో సన్నాయి నొక్కులు నొక్కిన….. అరకొర సమాచారంతో సీఎం ఎలా పడితే అలా మాట్లాడొచ్చా అనే వాదన కూడా వినిపిస్తోంది . మొత్తం మీద లడ్డు ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కయ్యారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని డామేజ్ చేయగలిగారు ఏమో కానీ, నైతికంగా చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అనేది ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిలో పరినీతి ఉంటే…. ఈ వ్యవహారం తనకు తెలియగానే మూడో కంటికి తెలియకుండా దీన్ని పరిష్కరించాల్సి ఉండేది. మన ప్రజల భావోద్వేగానికి సంబంధించింది. అలాంటి మాటలు బయట మాట్లాడడం కన్నా సమస్యను అంతర్గతంగా పరిష్కరించి ఉంటే బాగుండేది. కానీ వెంకటేశ్వర స్వామిని , లడ్డుని తన రాజకీయ ప్రయోజనాల కోసం సైతం వాడేసిన చంద్రబాబు తిరుమలని వ్యాప్తంగా బ్రష్టు పట్టించారు.