Chandrababu Naidu: యాగం.. రాజయోగం.. సీఎం కుర్చీ బాబుదేనా..? ఆ యాగం చేస్తే గ్యారంటీయా

రాజశ్యామల యాగం చేస్తే.. రాజ్యాధికారం వస్తుందని పండితులు చెబుతారు. ఆనాటి రాజుల కాలం నుంచి ఈనాటి కేసీఆర్ దాకా చాలామంది ఈ యాగం చేశారు. శత్రు బాధ పోవడానికి, విజయం సిద్ధించడానికి రాజకీయ నేతలు ఎక్కువగా రాజశ్యామల యాగం చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 04:32 PM IST

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. వచ్చేవారంలో బీజేపీతోనూ జతకడుతున్నారు. మానవ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ దైవ బలం కూడా కలసి రావాలి కదా. అందుకే చంద్రబాబు రాజశ్యామల యాగం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చిన ఈ యాగం మరి ఇప్పుడు ఏపీలో చంద్ర బాబుకి కలిసొస్తుందా..?

TDP IN TO NDA: పొత్తుల టైమ్.. ఎన్డీఏలోకి టీడీపీ ! ముహూర్తం ఎప్పుడంటే ?
రాజశ్యామల యాగం చేస్తే.. రాజ్యాధికారం వస్తుందని పండితులు చెబుతారు. ఆనాటి రాజుల కాలం నుంచి ఈనాటి కేసీఆర్ దాకా చాలామంది ఈ యాగం చేశారు. శత్రు బాధ పోవడానికి, విజయం సిద్ధించడానికి రాజకీయ నేతలు ఎక్కువగా రాజశ్యామల యాగం చేస్తుంటారు. విజయం సిద్ధించాలని కోరుతూ శ్యామలాదేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోడానికి ఈ యాగం నిర్వహిస్తుంటారు. ఈ తరానికి ఈ యాగం సంగతి తెలియడానికి కారణం కూడా పొలిటికల్ లీడర్సే. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈ యాగం చేసి రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా యాగం చేసినా పాపం.. అదృష్టం కలిసి రాలేదు. అమ్మవారి దయ కలగలేదు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లిలోని తన నివాసంలో ఐదు రోజులుగా రాజశ్యామల యాగం చేస్తున్నారు. ఆదివారం నాడు పూర్ణాహుతితో ఈ యాగం ముగియనుంది. 50 మంది రిత్విక్కులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

చంద్రబాబు నాయుడు రాజశ్యామల యాగం చేయడం ఇదే మొదటిసారి. గతంలో 2019లో ఎన్నికల ముందు కూడా విశాఖలోని శారద పీఠంలో ఏపీ సీఎం జగన్ ఈ యాగం నిర్వహించి.. విజయం సాధించారు. అయితే శారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా ఈసారి కూడా జగన్ రాజశ్యామల యాగం చేస్తారన్న టాక్ నడిచింది. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాగం చేసినా ఆయనకు ఈసారి కలసి రాలేదు. కానీ PCC అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి నవంబర్ నెలలో ఈ యాగం చేసినట్టు తెలుస్తోంది. అందుకే విజయం ఆయన్ని వరించిందని తెలుస్తోంది. మరి ఏపీలో చంద్రబాబుకు రాజశ్యామల యాగం కలిసొస్తుందా.. అధికారంలోకి వస్తారా అన్నది రాబోయే 3 నెలల్లో తేలనుంది.