మోడీకి ఆ మంత్రి అంటే ప్రాణం, చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ రెండు నిముషాలు తెలుగులో మాట్లాడటంతో విజయవాడ ప్రజలకు గుర్తుంటారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మోదీ కి ఎంతో ఇష్టమైన నాయకుడు మనోహర్ లాల్ ఖత్తర్ కావడంతో ప్రధాన డిపార్ట్మెంట్ లు ఇచ్చారని కొనియాడారు.

  • Written By:
  • Publish Date - December 7, 2024 / 06:23 PM IST

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ రెండు నిముషాలు తెలుగులో మాట్లాడటంతో విజయవాడ ప్రజలకు గుర్తుంటారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మోదీ కి ఎంతో ఇష్టమైన నాయకుడు మనోహర్ లాల్ ఖత్తర్ కావడంతో ప్రధాన డిపార్ట్మెంట్ లు ఇచ్చారని కొనియాడారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ లు ఎంతో వేగంగా జరుగుతున్నాయన్నారు. EESL లో రిజిష్టర్ చేసుకుని ఇంటి వద్ద నుంచే సంపాదించుకుంటున్నారని తెలిపారు.

అంగన్వాడీ లు ఇప్పుడు ఇచ్చిన స్టవ్ ల ద్వారా వేగంగా వంటలు చేయగలరన్న ఆయన 43 వేల‌ స్కూళ్ళలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారన్నారు. ఏ రాష్ట్రంలో అయినా తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయాన్ని చెపుతుందని పరిశ్రమలు, వ్యవసాయం, వాహనాలు అన్నిటికీ విద్యుత్ అవసరమన్నారు చంద్రబాబు. 1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చాం… 2004 కి మనం పవర్ వినియోగంలో పొదుపులో ఉన్నామన్నారు. విద్యుత్ రంగంలో ఏపీని మొదటి ర్యాంకు కు తెస్తాం టిడిపి హయాంలో అని ధీమా వ్యక్తం చేసారు.

గత టిడిపి ప్రభుత్వం హయాంలో విద్యుత్ వెలుగులు తెచ్చామని పేర్కొన్నారు. ఒక యూనిట్ కరెంట్ ఆదా చేస్తే రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసినట్టవుతుందన్నారు. ఒక ఉర్జావీర్ కు 2500 నుంచీ 15వేలు అదనపు ఆదాయం వస్తుందని మీ ఇంటి‌దగ్గరే మీరు డబ్బు సంపాదించే మార్గం చూపించడంలో ఇది మొదటి మెట్టన్ని తెలిపారు. ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉందనన్నారు చంద్రబాబు. కోవర్కింగ్ స్పేస్ లలో కొత్త కంపెనీలు పెడతామని తెలిపారు. 55700 అంగన్వాడీలకి 2 నెలల్లోగా ఇండక్షన్ స్టవ్ లు ఇస్తామన్నారు.

PMAY కింద‌ ఇళ్ళు కట్టుకున్న వారికి కరెంటు, బల్బులు ఇచ్చామన్న ఆయన ప్రతీ ఇంటికి 20% కరెంటు ఆదా చేసుకునే అవకాశం EESL పరికరాలు వాడితే వస్తుందన్నారు. పవర్ జనరేషన్ ను ప్రజాస్వామ్యం చేయడం వల్ల మీ ఇంటి విద్యుత్ మీరే చేసుకోవచ్చని తెలిపారు. సోలార్ పవర్ ను వినియోగించుకుంటే.. కరెంటు బిల్లు కట్టక్కర్లేదన్నారు. సోలార్ పవర్ తయారు చెసుకుని అవసరం అయితే 500 యూనిట్లు కరెంటు గ్రిడ్ కి ఇవ్వచ్చని తెలిపారు. ప్రజలకు అవసరమైనపుడు అదే కరెంటు వారికి తిరిగిస్తామన్నారు. వాట్సప్ మెసేజ్ తో పని పూర్తి చేస్తాం.. అలా పూర్తి చేయకపోతే…యాక్షన్ కూడా తీసుకుంటామని హెచ్చరించారు.