ఐపిఎస్ కు అన్ని దారులు మూసిన బాబు

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో డీజీ హోదాలో ఉన్న పీ ఎస్ ఆర్ ఆంజనేయులును సస్పెండ్ చేసింది ప్రభుత్వం. జీవో నెంబర్ 1590పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసారు. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - September 15, 2024 / 07:57 PM IST

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో డీజీ హోదాలో ఉన్న పీ ఎస్ ఆర్ ఆంజనేయులును సస్పెండ్ చేసింది ప్రభుత్వం. జీవో నెంబర్ 1590పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసారు. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో విడుదల చేసింది. ఫిబ్రవరి 2 వ తేదీ కేసు రిజిస్టర్ అయితే జనవరి 31 నే పీ ఎస్ ఆర్ కాంతి రానా టాటా ను, విశాల్ గున్ని లను పిలిచి జత్వానీ కుటుంబాన్ని అరెస్టు చేయాలని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని విచారణలో వెల్లడి అయింది.

తన అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వాపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారట ఆంజనేయులు. పీ ఎస్ ఆర్ చేపట్టిన చర్య ఘోరమైన దుష్ప్రవర్తన, అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం అని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అన్ని సామర్ధ్యాలు పీ ఎస్ ఆర్ కు ఉన్నాయని, ముంబైకి వెళ్లే అవకాశం ఉందని, రికార్డులను ధ్వంసం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారనే సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. సస్పెన్షన్ పీరియడ్ లో అనుమతి లేకుండా విజయవాడ వదలి వెళ్లొద్దని పీ ఎస్ ఆర్ ను ప్రభుత్వం ఆదేశించింది.