CHANDRABABU NAIDU: ఏపీ రాజకీయాల్లో కొంత కాలం నుంచి వాలంటీర్ల వ్యవహారం రచ్చికెక్కింది. విలేజ్ ఏరియాస్‌లో ప్రజలకు ఎంతో సహాయంగా ఉండే వాలంటీర్లపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చకు కారణమయ్యాయి. ఇంటికి సంక్షేప పథకాలు తీసుకువెళ్లి అందించే వాలంటీర్లపై ఆరోపణలు చేయడం విమర్శించడంతో చంద్రబాబుపు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో తాను మాట్లాడింది తప్పు అనుకున్నారో లేక ఇలాంటి రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదో తెలియదు కానీ వాలంటీర్ల విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు.
Akhilesh Yadav Daughter: యూపీ ప్రచారంలో అదితి ఫిదా.. తల్లి డింపుల్ గెలుపు కోసం తంటాలు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు.. వాళ్ల జీతం కూడా పెంచుతామంటూ చెప్తున్నారు. ఇదే పాయింట్‌పై ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసి.. ఇప్పుడు వాళ్లకు జీతాలు పెంచుతాం ఓటేయ్యండి అంటే ఎందుకు నమ్ముతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం వాలంటీర్లను మాత్రమే కాదు. జగన్ ఇస్తు సంక్షేమ పథకాలను కూడా చంద్రబాబు విమర్శించారు. దీనిపై కూడా టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. దీందో పథకాల విషయంలో కూడా మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే జగన్‌ను మించిన సంక్షేమ పథకాలు ఇస్తామంటూ చెప్తున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ యూటర్న్‌తో జగన్ చేస్తున్నవి మంచి పనులే అని ఆయనే ఒప్పుకున్నట్టు అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు కపటిప్రేమను వాలంటీర్లు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్‌కు పేరు వచ్చింది కాబట్టే ఆ వ్యవస్థను లేకుండా చేస్తారని చెప్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వాలంటీర్లందరినీ తొలగించి వాళ్ల స్థానంలో టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారంటూ చెప్తున్నారు. ఒకప్పుడు జన్మభూమి కమిటీల్లో ఎవరు ఉన్నారో గుర్తు చేసుకోవాలంటూ ప్రజలకు చెప్తున్నారు. విషయం ఏదైనా ఒకప్పుతు తాను తప్పన్న వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు పొగుడుతూ చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని చెప్తున్నారు పొలటికల్ అనలిస్ట్‌లు. ఇలాంటి సందర్భాన్ని బట్టి యూటర్న్ తీసుకుంటే చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరంటూ చెప్తున్నారు.
https://www.youtube.com/watch?v=k8R1KBNqy-4