CHANDRABABU NAIDU: ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా సీఐడీ చూపించలేకపోయిందని పేర్కొంది. హైకోర్టు తీర్పును CID సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిగినా.. చంద్రబాబు బెయిల్ రద్దు కాకపోవచ్చంటున్నారు న్యాయనిపుణులు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని హైకోర్టు చెప్పింది. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో కూడా ఉంచారు. మరి ఆయన ఇప్పుడు జనంలోకి వెళ్ళడానికి అడ్డంకులు తొలగినట్టేనా..? ఈనెల 29 తర్వాత బాబు జనంలోకి వస్తాడా..? అయితే 17A సెక్షన్ కేసులో సుప్రీంకోర్టులో తీర్పు వస్తే అన్నింటిలోనూ బాబుకి రిలీఫ్ దక్కినట్టే అంటున్నారు.
REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకి పూర్తిస్థాయి బెయిల్ వచ్చినా.. మరో 6 కేసులు పెట్టింది జగన్ ప్రభుత్వం. ఇంకా కొత్త కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ సీఐడీ అధికారులు, పోలీసులు. ఆ మిగిలిన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇంకా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ వాయిదాలు కోరుతుండటంతో కేసుల్లో డెవలప్‌మెంట్ కనిపించడం లేదు. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ దక్కాలంటే.. సుప్రీంకోర్టులో నడుస్తున్న 17ఏ సెక్షన్ వర్తింపుపై అనుకూల తీర్పు వస్తేనే సాధ్యమవుతుంది. అప్పుడే ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయి. మళ్లీ ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏదైనా కేసు పెట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఇప్పటిలాగా సీఐడీ ఏదో ఒక కేసు పెట్టి.. కేసు నమోదైందని గవర్నర్‌కు చెబితే సరిపోదు. చంద్రబాబుకు ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు చూపించాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది సందేహమే. అందుకే 17ఏ సెక్షన్ వర్తింపుపై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే బెటర్ అంటున్నారు టీడీపీ నేతలు. స్కిల్.. కేసులో అరెస్టు చేసినప్పుడే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు. ఇలాంటి సందర్భంలో 17ఏ చంద్రబాబుకు వర్తించదని గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
KCR SPEECH : రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు… కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టండి : కేసీఆర్
హోరాహోరీగా వాదనలు నడిచాయి. ఏసీబీ చట్టంలో సెక్షన్ 17ఏ తెచ్చింది.. కుట్రపూరితంగా పెట్టే రాజకీయ వేధింపుల కేసుల నుంచి.. అంతకు ముందు పదవుల్లో ఉన్న వారికి రక్షణ కల్పించేది. ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది రాజకీయ కక్ష సాధింపేనని బాబు తరపు న్యాయవాదులు వాదించారు. కేసు వాదనలు, గత తీర్పులను పరిశీలిస్తే ఆయనకు రిలీఫ్ వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ కేసు సుప్రీంలో తీర్పు రిజర్వ్ అయింది. దీపావళి సెలవుల తర్వాత ప్రకటిస్తామని బెంచ్ తెలిపింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా 30వ తేదీన వస్తుంది. 17ఏపై తీర్పు వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు మరోసారి అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఏదో ఒక కేసులో బాబును జైల్లోనే ఉంచాలని ప్రయత్నిస్తోంది. అందువల్ల ఒక కేసు తర్వాత మరొకటి బయటకు తీసి బెయిల్ వచ్చే సమయంలో మరోసారి అరెస్టు చూపించవచ్చని అంటున్నారు.
17ఏపై తీర్పు అనుకూలంగా వస్తే.. చంద్రబాబు మళ్ళీ జనంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 30న తెలంగాణలో ఎన్నికలు, డిసెంబర్ 3న రిజల్ట్స్ ఉన్నాయి. ఇవి అయిపోయాక ఏపీలో మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి బాబు ప్లాన్ చేసుకుంటున్నారు. మరో 4 నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉండటంతో జనంలోనే ఎక్కువ టైమ్ గడిపేలా ప్లాన్ చేస్తున్నారు. తనను అరెస్ట్ చేసిన నంద్యాల నుంచే మళ్ళీ బాబు టూర్ ఉండవచ్చని తెలుస్తోంది.