Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ రాజకీయాల్లో బిజీ కానున్నారు. త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స కూడా తీసుకుని, కోలుకున్నారు. దీంతో పూర్తిస్తాయి రాజకీయాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లడం చాలా అవసరం. అందుకే ఇకపై వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. అంతకుముందు దేవాలయాల్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
Exciting exit polls : కాక రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. రాజకీయ నాయకుల్లో నరాలు తెగే టెన్షన్..
ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. ఈ నెల 3న సింహాచలం అప్పన్న స్వామిని, 5న శ్రీశైలం మల్లన్నను, అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి ఆయన వెళ్లనున్నారు. తర్వాత ఈ నెల 10 నుంచి వివిధ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. జగన్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. మరోవైపు ఢిల్లీలో కూడా పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఏపీలో ఓట్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఓటమి భయంతో సీఎం జగన్, వైసీపీ నేతలు దొంగ ఓట్లు చేరుస్తున్నారని, టీడీపీ సానుభాతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 6 నుంచి 8 లోపు చంద్రబాబు సీఈసీకి కలవనున్నారు.