Chandrababu Naidu: బెయిలా.? కస్టడీనా..? స్కిల్‌ స్కాంలో నేడు కీలక తీర్పు..

చంద్రబాబును మరోసారి విచారణకు అప్పగించాలంటూ సీఐడీ తరఫు న్యాయవాదులు, బెయిల్‌ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 03:34 PM IST

Chandrababu Naidu: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కాం కేసులో నేడు కీలక తీర్పు రాబోతోంది. బాబును మరోసారి విచారణకు అప్పగించాలంటూ సీఐడీ తరఫు న్యాయవాదులు, బెయిల్‌ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే ఇరువర్గాల లాయర్లు కోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి.

దీంతో చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా లేదా కస్టడీకి ఇస్తారా అనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు 14 రోజు కస్టడీని రెండుసార్లు పొడిగించారు. మొదట రెండు రోజులు పొడగించి, ఆ రెండు రోజులు సీఐడీ విచారణకు అప్పగించారు. విచారణ అనంతరం మరో 11 రోజులు కస్టడీ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే చంద్రబాబు విచారణలో సహకరించలేదని.. మరి కొన్ని రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని నిజాలు బయటికి వస్తాయని సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే విషయంలో జడ్జి ఇప్పటికే చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇవాళ ఇదే విషయంలో వాదనలు కొనసాగనున్నాయి. అటు సుప్రీం కోర్టులో కూడా క్వాష్‌ పిటిషన్‌కు సంబందించి ఇవాళ కీలక జడ్జ్‌మెంట్‌ రానుంది. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్‌ ఎత్తివేయాలంటూ చంద్రబాబు లాయర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

చట్ట విరుద్ధంగా చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారంటూ వాదించారు. కానీ వాళ్ల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది ఏపీ హైకోర్టు. ఈ కేసును క్వాష్‌ చేసేందుకు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో చాలెంజ్‌ చేశారు చంద్రబాబు లాయర్లు. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో ఎలాంటి తీర్పు రాబోతోంది అనే విషయం ఆసక్తిగా మారింది.