చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్… టిడిపిలోకి వైసీపీ ఎంపీలు

  • Written By:
  • Updated On - August 5, 2024 / 01:06 PM IST

రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి మొహమాటలు ఉండవు. పార్టీలను చేర్చడం, ఎంపీలు ఎమ్మెల్యేలను కొనడం… ఇందుకోసం ఎన్ని ఎత్తుగడలైనా వేస్తూ ఉంటారు. ఓటుకు నోటు కేసులో దారుణంగా ఇరుక్కుని పరువు పోగొట్టుకున్న తర్వాత అయినా ఆయన ఎంపీలు ఎమ్మెల్యేల కొనుగోలును ఆపేస్తారని కొందరు భావించారు. అలవాటైనా ప్రాణం ఊరుకుంటుందా? అడ్డంగా దొరికి పోవడం, మళ్లీ అవే పనులు చేయడం పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని భావించే చంద్రబాబు తన బేరసారాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.2015లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అంత పరాభవం జరిగిన, 2014 -19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను వైసీపీ నుంచి లాగేశారు. జగన్ కూడా తక్కువేం తినలేదు.2019లో అధికారంలోకి వచ్చాక అవసరం లేకపోయినా టిడిపి నుంచి ఆయన ఎమ్మెల్యేలను లాగారు.

ఇప్పుడు ఎన్నికలు అయిపోయి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ చంద్రబాబు పాత గేమ్ మొదలుపెట్టారు. 1982లో టిడిపి ఏర్పడిన తర్వాత రాజ్యసభలో ఆ పార్టీ జీరో కి చేరుకోవడం ఇదే మొదటిసారి. రాజ్యసభలో ఏపీకున్న 11 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో రెండేళ్ల వరకు రాజ్యసభకు ద్వైపాక్షి ఎన్నికలు కూడా లేవు . కేంద్రంలో ఏ బిల్లు ఆమోదించాలన్న లోక్సభ తో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం అత్యంత కీలకం. లోక్సభలో వైసీపీ ఎంపీల సంఖ్య నాలుగు కి పడిపోయినప్పటికీ… రాజ్యసభలో మాత్రం 11 ఉండడంతో ఆ పార్టీకి ఎన్డీఏ, ఇండియా కూటములు రెండు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇటీవలే ఢిల్లీలో జగన్ చేసిన ఆందోళనకు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి మద్దతు తెలపడానికి ఇది కూడా ఒక కారణం. అందుకే చంద్రబాబు రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేశారు. 11 మందిలో కనీసం ఏడు లేదా ఎనిమిది మందిని టిడిపికి లాగ గలిగితే రాజ్యసభలో ఎంతో కొంత బలం కనిపిస్తుంది. అయితే వాళ్లని ఉన్నఫలంగా టిడిపిలో చేర్చుకోవడం కంటే, రాజీనామాలు చేయించి… ఏపీలో కూటమికి 164 సభ్యుల బలం ఉంది కనుక.. వాళ్లనే మళ్లీ టిడిపి ఎంపీలుగా ఎన్నుకోవచ్చన్నది బాబు ఆలోచన.

టిడిపి నుంచి బిజెపికి వెళ్లి ఈమధ్య లోక్సభ ఎంపీగా ఎన్నికైన ఒక నేతను ఈ బేరసారాలకు మధ్యవర్తిగా దింపారు. మీడియేటర్ పనుల్లో చేయి తిరిగిన ఈ ఎంపీ అప్పుడే ఆపరేషన్ మొదలుపెట్టేసారు. కొందరు వైసీపీ సభ సభ్యులతో ఒక మంతనాలు కూడా జరిగిపోయాయి. ఒక్కో సభ్యుడికి భారీ ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్ కూడా పెట్టారు. అయితే 2014-19 నాటి పరిణామాలకు భిన్నంగా టిడిపిలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆరు నెలల లోపు నిర్వహించే ఎన్నికల్లో ఏపీ శాసనసభలో బలంతో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా గెలిపిస్తామని ఈ మధ్యవర్తి హామీ ఇచ్చారు.

ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ ఎంపీలు, వై వి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని ఉన్నారు. వీరిలో ఆరుగురు పూర్తిగా జగన్కు అత్యంత సన్నిహితులు. వాళ్లని టిడిపి కదపలేకపోవచ్చు. మిగిలిన ఐదుగురు పైనే ప్రస్తుతం చంద్రబాబు టార్గెట్ పెట్టారు. వీరిలో గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలు మొదటి దశలో టిడిపిలోకి మారవచ్చని వినిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రాంరెడ్డి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ లను టిడిపి లాగలేకపోవచ్చు. సుబ్బారెడ్డి కి 2030 వరకు, అలాగే సాయి రెడ్డికి 2028 వరకు పదవీకాలం ఉంది. మొత్తం మీద చంద్రబాబు వ్యూహం ఫలిస్తే కనీసం ఐదుగురు రాజ్యసభ సభ్యులు అయితే గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.