ఢిల్లీలో బాబు రేవంత్ భేటీ…? ఈ మూడే ఎజెండా…?

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల సిఎంలు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్. సోమవారం మధ్యాహ్నం ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 10:26 AM IST

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల సిఎంలు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్. సోమవారం మధ్యాహ్నం ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండే అవకాశం ఉంది. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారు. ఇక కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు.

మంత్రి వర్గ విస్తరణ, నామినేట్ పదవుల పై చర్చించే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వినతీపత్రం ఇస్తారు. ఢిల్లీ లో రెండు రోజులు పాటు చంద్రబాబు పర్యటన ఉంటుంది. సాయంత్రం 4.30 నిమిషాలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అవుతారు. పలువురు కేంద్రమంతులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో అమరావతికి రైల్వే లైన్, ఓ స్టేషన్ ను కూడా చంద్రబాబు కోరే అవకాశం ఉండవచ్చు.

విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గించాలని కూడా చంద్రబాబు కోరనున్నారని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ లతో రేపు చంద్రబాబు భేటీ ఉండనుంది. బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు.. ప్రధానిని కలవడం ఇదే తొలిసారి కావడంతో ఆసక్తి పెరుగుతోంది. రైల్వే జోన్, సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు ప్రధానిని కోరే అవకాశం ఉంది.

అయితే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణా నుంచి వచ్చిన వరద నీరు ఏపీని ఇబ్బంది పెట్టింది. మున్నేరు ఆక్రమణల ప్రభావం ఏపీపై కూడా పడింది అనే వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పైనున్న తెలంగాణా… చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో వరదలు వచ్చిన సమయంలో కిందనున్న ఏపీపై తీవ్రత పడకుండా మున్నేరుని విస్తరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉందని అంటున్నారు.

అలాగే తెలంగాణాలో ఉన్న ఏపీ ఆస్తులపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఉన్న కొన్ని భవనాలపై ఎప్పటి నుంచో మీమాంస నెలకొంది. దీనిపై కూడా వీరు ఇద్దరూ ఢిల్లీలో చర్చించే అవకాశం ఉండవచ్చు. అలాగే రేవంత్ రెడ్డి కూడా… తెలంగాణా ఎమ్మెల్యేల లేఖలను టీటీడీలో అనుమతించాలని అలాగే బోర్డ్ లో తెలంగాణాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరే అవకాశం ఉండవచ్చు. ఇంకా తిరుమల బోర్డ్ ను ఏపీ సర్కార్ ప్రకటించలేదు. మరి ఏం జరగబోతుంది ఈ రెండు రోజుల్లో అనేది ఆసక్తిగా మారింది.