ఇది పవర్ స్టార్ వాల్యూ… పవన్ చెప్తే నా జీతం ఇచ్చేస్తా: చంద్రబాబు

కేబినేట్ మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన ఎన్ డీ ఏ కూటమి పార్టీల కీలక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 07:43 PM IST

కేబినేట్ మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన ఎన్ డీ ఏ కూటమి పార్టీల కీలక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు, మూడు పార్టీల ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. 100 రోజుల పాలన పూర్తవుతున్న నేపద్యంలో పాలనా తీరు, పార్టీల మధ్య సహకారంపై చర్చించారు.

నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో మూడు పార్టీల నేతలు ఎవరూ జోక్యం చేసుకోవద్దు అని చంద్రబాబు స్పష్టం చేసారు. రేపటి భవిష్యత్ గెలుపుకు ఇదే చాలా కీలకం అన్నారు ఆయన. ఇందులో మూడు పార్టీల నేతలకు ఎలాంటి మినహాయింపు లేదన్న చంద్రబాబు… దీనిపై పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి కలిసి ఇప్పటికే మాట్లాడుకున్నామని వ్యాఖ్యానించారు. రేపు 78 అన్నా కేంటీన్లను ప్రారంభిస్తున్నామని ఇంకో 15 రోజుల్లో మొత్తం 203 అన్నా క్యాంటిన్ లను ప్రారంభిస్తామని తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 350 కోట్ల సీ ఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదొక చరిత్ర అని కొనియాడిన ఆయన పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ఒప్పుకుంటే ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దాం అని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా స్పందించిందని అభినందించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా చంద్రబాబు స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకునే బాధ్యత రాష్ట్రం, కేంద్రం తీసుకుంటుందన్నారు ఆయన.

మొన్ననే 500 కోట్లు ఇచ్చారు, త్వరలో మరిన్ని నిధులు స్టీల్ ప్లాంట్ కు ఇవ్వబోతున్నారని ప్రైవేటు కు అప్పజెప్పకుండా ప్రభుత్వంలోనే ఉంచే విధంగా ఆలోచనలు సాగుతున్నాయి అని తెలిపారు. రాష్ట్రంలో అందరికంటే విశాఖ లోనే ఎక్కువ మెజారిటీలు వచ్చాయన్నారు. అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని కోరారు. జత్వాని విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు.