బ్రేకింగ్: మహిళా ఎమ్మెల్యేపై బాబు సీరియస్, కఠిన నిర్ణయమేనా…?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేసే సూచనలు కనపడుతున్నాయి. ప్రభుత్వంపై పాలనపై సీరియస్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చేస్తారో అనే ఆందోళన అధికారులతో పాటుగా ఎమ్మెల్యేల్లో కూడా నెలకొంది.

  • Written By:
  • Publish Date - September 16, 2024 / 11:59 AM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేసే సూచనలు కనపడుతున్నాయి. ప్రభుత్వంపై పాలనపై సీరియస్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చేస్తారో అనే ఆందోళన అధికారులతో పాటుగా ఎమ్మెల్యేల్లో కూడా నెలకొంది. చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో తీసుకునే నిర్ణయాలు కూడా కాస్త సంచలనంగానే ఉంటున్నాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియో బయటకు రాగానే ఆయనను సస్పెండ్ చేసేసారు చంద్రబాబు. త్వరలోనే మరికొందరిని సస్పెండ్ చేసే అవకాశం ఉందనే వార్త చెమటలు పట్టిస్తుంది.

గుజరాత్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు… అనంతరం రాష్ట్రానికి వచ్చి రెండు రోజుల్లో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాలనపై ప్రజా ప్రతినిధుల రివ్యూలు అడుగుతారు. ఇక ఎమ్మెల్యేల పని తీరుని కూడా అందరి ముందు చంద్రబాబు ప్రస్తావిస్తారు. కొందరు ఎమ్మెల్యే ల తీరు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారిపై నివేదికలను తెప్పించుకున్నారు. రాయలసీమ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటుగా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేపై బాబు సీరియస్ గా ఉన్నారు.

మహిళా ఎమ్మెల్యే భర్త తీరు పై చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటికే. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వైసిపి నాయకులను కార్యకర్తలు వెంటపెట్టుకొని, తిరగడం పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా మార్పు రాలేదని, పార్టీ పరువు తీస్తున్నారని ఆయన సీరియస్ గా ఉన్నారు. అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు ఆయన. ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా రెండు రోజుల్లో స్పష్టత రానుంది. రేపు లేదా ఎల్లుండి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తి అయింది. మొదటగా 18 కార్పొరేషన్ చైర్మన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మిగిలిన నామినేటెడ్ పదవులు అన్ని దసరా లోపు పూర్తి చేస్తారు. ఇక వైసీపీ నేతలతో స్నేహం చేసే నేతలకు సంబంధించిన నివేదికను కూడా చంద్రబాబు సిద్దం చేసారు. వాళ్ళు అందరికి త్వరలోనే షాక్ లు ఇవ్వనున్నారు.