బాబు దెబ్బకు IPSలు విలవిల జగన్ అరెస్ట్ ఎప్పుడంటే..?

బాలీవుడ్ నటి డాక్టర్ కాదంబరి జెత్వానీని నిర్భంధించి, అక్రమకేసు పెట్టి మరీ వేధించారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ వేసిన సస్సెన్షన్ వేటు దేశవ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్స్ మధ్య ఈ టాపిక్ ఒక రేంజ్‌ లో సునామీ సృష్టించిందనే చెప్పాలి.

  • Written By:
  • Publish Date - September 17, 2024 / 04:40 PM IST

బాలీవుడ్ నటి డాక్టర్ కాదంబరి జెత్వానీని నిర్భంధించి, అక్రమకేసు పెట్టి మరీ వేధించారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ వేసిన సస్సెన్షన్ వేటు దేశవ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్స్ మధ్య ఈ టాపిక్ ఒక రేంజ్‌ లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. మీడియా ముందుకు కాదంబరి జెత్వానీ ఎంట్రీ నుంచి ఈ బడా ఐపీయస్ అధికారుల సస్పెన్షన్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో బ్యూరోక్రాట్లు, పొలిటికల్ లీడర్లు కళ్లల్లో వత్తులేసుకుని మరీ చూసారంటే నమ్మగలరా..నిజం చె్ప్పాలంటే అంతకుమించి చూసారు. అయితే సస్పెన్షన్ వేటు తర్వాత ఇక రాజకీయం మాత్రమే కాదు పరిణామాలు కూడా వేగంగా అంతకు మించి రంజుగా మారతాయనుకున్నారు అంతా… కానీ ఇప్పటి వరకు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చోసుకోలేదు. అంతకుమించి ఒక్కటంటే ఒక్క ఖండన స్టేట్‌మెంట్స్ కూడా రాకపోవడం పొలిటికల్ వర్గాలను మాత్రమే కాకుండా మేధావులను కూడా విస్మయంలోని నెట్టేసినట్లు అయింది.

సాధారణంగా పొలిటికల్ లీడర్స్ వర్సెస్ బ్యూరోక్రాట్స్ అనే ఎపిసోడ్ కనుక తెరమీదకు వస్తే…. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు అంతా ఒకతాటి మీదకు వస్తారు. సివిల్ సర్వెంట్లలో ఆత్మస్ధైర్యం దెబ్బతింటుందంటూ ప్రెస్ మీట్లు, మెమోరాండాలు హడావిడి చేస్తారు. PSR ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా తాతా మీద కూటమి సర్కార్ వేటు వేసిన తర్వాత నో డౌట్..ఇక బ్యూరోక్రాట్లు ముఖ్యంగా ఆంధ్రప్రదే్శ్ IPS అధికారుల సంఘం సభ్యులు ముందుకు వస్తారు,నిరసనలు చేస్తారు అని అందరూ అనుకున్నారు. చివరకు సస్సెండ్ అయిన ఆ IPS అధికారులతో సహా… కానీ నో రెస్పాన్స్.. సస్పెన్షన్ వేటు పడి ఇన్ని గంటలు అవుతున్నా సరే ఎక్కడా ఉలుకుపలుకు లేదు. అంటే దీని అర్ధం కాదంబరి జెత్వానీని ఆ ముగ్గురు ఐపీయస్ అధికారులు చెప్పుకోలేని విధంగా వేధించారా… ఈ ఒక్క ఇష్యూ మాత్రమే కాకుండా మరెన్నో చీకటి పనులు జగన్ సర్కార్ కోసం వీళ్లు చేసారా..? ఐపీయస్ లుగా కాకుండా వైసీపీయస్‌లుగా చెలరేగిపోయారు కనుకే ఐపీయస్ అధికారుల సంఘం సైలెంట్ మోడ్ లో ఉందా , కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏం చేయలేనప్పుడు మనకేమి తెలియదు, మనమేమి చూడలేదు అన్నట్లు ఉంటే సరిపోయేది అని ఇతర IPS అధికారులు అనుకున్నారా అనే రీతిలో ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మెదడుకు పజిల్స్ మీద పజిల్స్ విసురుతున్నాయి.

నిజానికి ఈ IAS,IPS లపై సస్పెన్షన్ వేటు పడటం ఉత్తర భారతదేశంలో కామన్ కానీ మన దక్షిణాదిన మాత్రం చాలా రేర్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే అయితే ఇప్పటి వరకు లేనే లేదు. ఇదే తొలి కీలక పరిణామం. సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ ఆర్టీ 1592తో సీఎం చంద్రబాబు కొట్టిన దెబ్బ అదుర్స్ అంతే… కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ట్విస్ట్ అయినప్పటికి.. దాదాపు రెండేళ్ల నుంచే చంద్రబాబు కొందరు IAS,IPS అధికారులు జగన్ కు బానిసలుగా పనిచేస్తున్నారంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. రేపు తాము అధికారంలోకి వస్తే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా. పవర్ లోకి వచ్చిన వెంటనే ఆ పని చేసి చూపించారు కూడా. దీంతో పొలిటికల్ లీడర్లకు అడుగులు మడుగులు వత్తాలంటే ఇక ముందు ముందు బ్యూరోక్రాట్లు వెయ్యి సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి కల్పించటంలో సీఎం చంద్రబాబు గ్రాండ్ సక్సెస్ అయ్యారని చెప్పాల్సిందే. ఇది వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆఫ్‌ ది రికార్డ్ చెబుతున్న మాట. అయితే కాదంబరి జెత్వానీ ఏడ్చిందని, ఆమె తీవ్ర ఆరోపణలు చేసిందని, ఆమె ను లైవ్ షో స్‌ లో కూర్చోబెట్టి డిబేట్స్ చేసారని, మీడియా తన స్టూడియోస్ నే వార్ రూమ్స్ గా మార్చేసాయని, ఏపి సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది కనుక మనం మాట్లాడుకుంటుంది , మనం వింటున్నది అంతా నిజమే అని అనుకోవడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే తప్పెవరిది, ఒప్పు ఎవరిది, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనేది నిర్ణయించాల్సింది న్యాయస్ధానాలు. అవును దోషులెవరో, నిర్ధోషులెవరో నిర్ణయించాల్సింది న్యాయస్ధానాలు మాత్రమే. సస్పెండ్ అయిన IPS అదికారులు తప్పకుండా లీగల్ ఫైట్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ CATను ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. సో లీగల్ ఫైట్ తప్పదన మాట. కొన్నేళ్ల పాటు ఇది కొనసాగిన తర్వాత న్యాయస్దానం ఇచ్చే తీర్పు అంతిమంగా నిజాన్ని నిలుపుతుంది. అయితే అసలు బురద తొక్కడం ఎందుకు మళ్లీ ఇంతగా కడుక్కునేందుకు ఎందుకు ఇంత చికాకు చేసుకోవటం అనేది తప్పని సరిగా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఏది ఏమైనా సరే ఈ కాదంబరి జెత్వానీ ఎపిసోడ్, IPS అధికారుల సస్పెన్షన్ ఎపిసోడ్… భారత రాజకీయాల్లో ఒక సీరియస్ కేస్ స్టడీగా మిగిలిపోవడం గ్యారంటీ.ఇక చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టార్గెట్ జగన్… జగన్ మాత్రమే అని టిడిపి, జనసేన క్యాడర్ సోషల్ మీడియా నుంచి ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్న మాట. అదే జరిగితే ఇక దేశ రాజకీయాలు నివ్వెరపోవటం, ఉలిక్కిపడటం ఖాయం. లెట్స్ సీ….