Chandrababu Naidu: కాలేజీ నాటి వైరం.. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెడుతున్న పెద్దిరెడ్డి.. ప్రతీకారం తీర్చుకుంటారా..?

ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లే. కొన్ని దశబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి వైరం ఉంది. అది ఇన్ని దశాబ్దాలైనా కొనసాగుతోంది. ఇద్దరూ రాజకీయాల్లోనే ఉండటంతో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువసార్లు చంద్రబాబు పై చేయి సాధించారు.

  • Written By:
  • Updated On - July 28, 2023 / 04:19 PM IST

Chandrababu Naidu: కాలేజీలో చదువుకునేటప్పుడు ఇద్దరి మధ్యా మొదలైన వైరం రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. అది కూడా దాదాపు నాలుగు దశాబ్దాలు దాటినా.. ఇంకా పగలు, ప్రతీకారాలతోనే రగులుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. మరొకరు ప్రస్తుత ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాలేజీ రోజుల్లో ఇద్దరిమధ్య మొదలైన వైరం ఇప్పుడు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.

ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లే. కొన్ని దశబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి వైరం ఉంది. అది ఇన్ని దశాబ్దాలైనా కొనసాగుతోంది. ఇద్దరూ రాజకీయాల్లోనే ఉండటంతో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువసార్లు చంద్రబాబు పై చేయి సాధించారు. అయితే, ఈసారి బాబును ఓడించి, తనపై పగ సాధించాలని పెద్దిరెడ్డి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉంటే, పెద్దిరెడ్డి వైసీపీ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. కాలేజీ రోజుల నుంచి మొదలైన వైరం రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. అయితే, ప్రతీకారం కోసం పెద్దిరెడ్డి ప్రస్తుతం పావులు కదుపుతున్నారు.

చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నతస్థానాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేగా 1989 నుంచి కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. చంద్రబాబును ఎమ్మెల్యేగా ఓడించడమే టార్గెట్‌గా జగన్, పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన భరత్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూస్తున్నారు. ఈ విషయంలో బాబును ఓడిస్తానని చాలెంజ్ చేసిన పెద్దిరెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గమైన పుంగనూరుకంటే.. కుప్పంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందువల్ల బాబు మెజారిటీ తగ్గించగలిగారు. ఈసారి ఒక అడుగు ముందుకేసి ఎమ్మెల్యేగా ఓడించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే కుప్పంలో పెద్దిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. కుప్పం వైసీపీ నేతల్లో నిరంతరం ఉత్సాహం నింపుతూ, ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. స్థానికులతో పెద్దిరెడ్డి, భరత్ మమేకం అవుతున్నారు.

మరోవైపు చంద్రబాబు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఈసారి తనకు లక్ష మెజారిటీ కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బాబు. లక్ష మెజారిటీ కాదు.. ముందు గెలిచి చూపించు.. చాలు.. అంటూ పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. దీంతో టీడీపీ వర్గీయులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కుప్పుం సంగతి తర్వాత గానీ.. ముందు నీ పుంగనూరు సంగతి చూసుకో అంటూ సూచిస్తున్నారు. ఈసారి మాత్రం చంద్రబాబును ఓడించి, పైచేయి సాధించడమే పెద్దిరెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి మాత్రం చంద్రబాబుకు వైసీపీ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. ఒకవేళ ఇక్కడ బాబు ఓడిపోతే.. ఆయన రాజకీయ జీవితానికి దాదాపు ఫుల్‌స్టాప్ పడ్డట్లే.