మంత్రులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు కావాల్సిందే అని సిఎం చంద్రబాబు స్పష్టం చేసారు. కేబినేట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం యొక్క లక్ష్యం నెరవేరాలని అన్నారు.

  • Written By:
  • Publish Date - October 16, 2024 / 04:51 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు కావాల్సిందే అని సిఎం చంద్రబాబు స్పష్టం చేసారు. కేబినేట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం యొక్క లక్ష్యం నెరవేరాలని అన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అసహనం వ్యక్తం చ్చేసారు.

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇసుక విషయంలో సీరియస్ అయ్యారు. సామాన్య, మధ్య, తరగతి ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంతో పాటు ఇంటి నిర్మాణంలో ఇసుక కొనుగోలు భారం కాకూడదు అన్నారు. కొందరు దళారులు సామాన్య ప్రజలకు ఇసుకను భారంగా మార్చడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉచిత ఇసుక విధానంలో,మద్యం విషయంలో తలదూర్చే వారిపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, వెంటనే మార్పు, రావాలని స్పష్టం చేసారు.