జగన్ ను తక్కువ అంచనా వేయొద్దు, ముగ్గురు మంత్రులకు బాబు ఆదేశాలు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్య సమావేశం అయ్యారు.

  • Written By:
  • Publish Date - September 28, 2024 / 04:51 PM IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్య సమావేశం అయ్యారు. వైసిపి వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. కృష్ణా- గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పల్లాకు, అశోక్ బాబును చంద్రబాబు ఆదేశించారు. మనం ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు లేకుండా… నిన్న జగన్ ను పోలీసులు అడ్డుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే తప్పుడు ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు అని జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ చేసే విమర్శల పట్ల.. అప్రమత్తంగా వ్యవహరించాలి వెంటనే కౌంటర్ ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు. లడ్డు వ్యవహారంలో తప్పుచేసి మనపై రుద్దాలని చూస్తున్నారని జగన్ ను తక్కువ అంచనా వేయవద్దని చంద్రబాబు సూచించారు.