మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అంటూ తెలంగాణలో హస్తం పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించింది. తెలంగాణ ఓటర్లు ఇచ్చిన తీర్పు వెల్లడి కావడానికి ఇంకా కొన్ని గంటలే టైమ్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం అన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. అంటే తెలంగాణలో జనం మార్పు కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది. అదే జరిగి.. ఒకవేళ టూ టర్మ్స్ పాలన చేసిన కేసీఆర్ ఇంటికి పోతే.. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి.. అధికార పార్టీపై వ్యతిరేకతతో బీఆర్ఎస్ ని జనం ఓడిస్తే.. ఏపీలోనూ వైసీపీని ఇంటికి పంపుతారా ? ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉండదా.. ఇక్కడి మార్పు అక్కడ కూడా కనిపిస్తుందా అన్న చర్చ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది.
జగన్ ఇప్పుడు బీ అలెర్ట్ గా ఉండాలి. తెలంగాణలో జనం మార్పు కోరుకొని కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే.. ఆంధ్రలోనూ ఆ ప్రభావం తప్పకుండా పడుతుందని అంటున్నారు. పాలక ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత ఉంటే కచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది. తెలంగాణలో ఫలితాలు చూస్తుంటే ఏపీలో కూడా మార్పు తప్పదనిపిస్తోంది. కానీ ఏపీ పరిస్థితులు వేరు.. తెలంగాణ సిట్యువేషన్ వేరు.. ఏపీలో ఉన్నన్న పథకాలు అక్కడ లేవు.. జగన్ కు జనం ఆదరణ ఉంది.. మళ్లీ ఆయన గెలుస్తాడు అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
KCR, Jagan, : కేటీఆర్ – జగన్.. మాస్టర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. !?
ఒకే.. జగన్ పథకాల రూపంలో జనానికి బాగానే డబ్బులు అందిస్తున్నాడు. పేదల్లో ఇంటింటికీ.. పథకం అందుతోంది. అదే మధ్యతరగతి జనం పరిస్థితి ఏంటి ? జనం అందిస్తున్న డబ్బులను నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ఇతర పన్నుల రూపంలో తిరిగి తీసుకుంటున్నాడన్న విమర్శలు కూడా సామాన్య జనంలో ఉన్నాయి. ఇక మధ్యతరగతి, యువత, పారిశ్రామిక వర్గం చూస్తే.. ఉచితాలు సరే.. అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోక ముందు.. విడిపోయిన తర్వాత కూడా.. హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇక్కడికి ప్రపంచ ఐటీ దిగ్గజాలు వచ్చి తమ భారీ క్యాంపస్ లను పెడుతున్నాయి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. అసలు రాజధానిపైనే ఏపీ జనానికి ఇప్పటిదాకా ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు. అదేమంటే.. అప్పడాల పరిశ్రమలతో MOU కుదుర్చుకున్నామని.. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెబుతున్న డైలాగులు.. ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నన్ను గెలిపిస్తే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా.. ఎందుకు రాదూ.. అని అడుగుతున్నా అంటూ 2019లో ఎన్నికల ముందు బీరాలు పలికారు ఏపీ సీఎం జగన్. కేంద్రాన్ని మెడలు వంచుతామన్నారు వైసీపీ నేతలు. కానీ ఏం చేశారు.. ఢిల్లీకి పోయి.. మోడీ, అమిత్ షాకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. పరిశ్రమల స్థాపన లేకపోవడం, అభివృద్ధి పనుల మీద కాకుండా.. ఉచితాలపైనే ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం అక్కడి యువతకు శాపంగా మారింది. ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా.. నిరుద్యోగ సమస్య అలాగే ఉంటుంది. అదే ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనతోనే వేలు, లక్షలమందికి ఉపాధి లభిస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఉచితాలపైన ఆశలు పెట్టుకోకుండా.. యువత తమ కుటుంబాన్ని తామే పోషించుకుంటారు.
పైగా పొద్దున లేస్తే.. మంత్రులు తమ శాఖల మీద సమీక్షలు పెట్టడం మానేసి… పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ మీద ఆరోపణలు చేయడం.. బూతులు.. పరుష పదజాలం వాడటం నిత్యకృత్యంగా మారిందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ పెద్దల అహంకారంపై మధ్యతరగతి.. ఆపై జనం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణలో కారు మార్పు చూశాక.. మనం కూడా ప్రభుత్వాన్ని ఎందుకు మార్చకూడదు అని ఆంధ్ర జనం అనుకుంటే 2024లో జగన్ ఇంటికి పోక తప్పదేమో.