భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రగిరిలో వైసీపీ ని ఓడించేందుకు కోట్లు ఖర్చు పెట్టిన వారికే చంద్రబాబు పదవులు ఇస్తారని… 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి అన్ని పార్టీలు కృషి చేశాయన్నారు. 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రగిరి లో చంద్రబాబు రంగంలోకి దించారని మండిపడ్డారు.
6 రోజులు లోకేష్ పాదయాత్ర చేసి మోహిత్ ఓటమి కోసం పనిచేశాడని చిన్న వయస్సు గల చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారని విమర్శించారు. మోహన్ బాబు మాతో బాగుంటూనే చంద్రగిరి లో మమ్మల్ని ఓడించడానికి ఎంతో కష్టపడ్డారన్నారు. చంద్రగిరి ని 25 మంది ఎమ్మెల్యేలు పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేసారు.