ధరణి ఇక్కడిది కాదు ఒడిస్సాది, కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసారు. అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని అన్నారు.

  • Written By:
  • Publish Date - December 20, 2024 / 05:38 PM IST

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసారు. అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని అన్నారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావలని భావించామన్న ఆయన ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందన్నారు. సహనం కోల్పోయేలా రెచ్చగొట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా మీరు ఆ అవకాశం వారికి ఇవ్వలేదన్నారు.

ఓపిక నశించి వాళ్లే వెళ్లిపోయినా చర్చకు అవకాశం కల్పించిన మీకు అభినందనలు అంటూ స్పీకర్ ను కొనియాడారు. రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి,చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమే అన్నారు. ఈ భూమిని ఆత్మగౌరవంగా, హక్కుగా భావించారన్నారు. భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారని తెలిపారు. అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చేలాయించాలని చూసినా భూమిని కాపాడుకోవడంలో వారు విజయం సాధించారన్నారు.

ఆ తరువాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా.. భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయని పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుకు కూడా కొంతమంది భూమిపై ఆధిపత్యం చాలాయించడమే కారణమన్నారు. యజమాని హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని తెలిపారు. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ గారు పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడాలని కోరారు. లేకపోతే చదువులేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదు.. 2010లోనే ఒడిస్సాలో ఈ-ధరణి పేరుతో IL&FS కంపెనీకి అప్పగించిందన్నారు. అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఈ-ధరణి పోర్టల్ ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టిందని తెలిపారు.