CI Anju Yadav: సీఐ అంజూ యాదవ్.. కొన్ని రోజుల నుంచి ఏపీలో ఈ పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది. రీసెంట్‌గా జనసేన నేతపై చేయిజేసుకోవడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ వెళ్లి ఆమెపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పేరు మరోసారి మీడియాలో మార్మోగిపోయింది. ఇప్పుడే కాదు కొంత కాలంగా అంజూ యాదవ్ చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.
అయితే ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అంజూ యాదవ్ ఒకప్పుడు చాలా డైనమిక్ ఆఫీసర్. 2003లో చంద్రబాబుపై బాంబ్ ఎటాక్ జరిగినప్పుడు అంజూ యాదవ్ వ్యవహరించిన తీరు లేడీ సింగాన్ని గుర్తు చేస్తుంది. చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసిన సమయంలో అంజూ యాదవ్ చంద్రబాబు కాన్వాయ్‌లోనే ఉన్నారు. కాన్వాయ్ వెళ్తున్న టైంలో ఒక్కసారి లీడ్ వెహికిల్ మీద బాంబ్ ఎటాక్ జరిగింది. వెంటనే తన కారు దిగిన అంజూ యాదవ్ నేరుగా చంద్రబాబు కారు దగ్గరికి వెళ్లింది. కారీ మీదకు ఎక్కి అంతా సేఫ్‌గా ఉన్నారో లేదో చెక్ చేసి వెంటనే వాళ్లను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించింది. నక్సలైట్ ఎటాక్ అంటేనే చాలా మంది భయపడి పారిపోతారు. కానీ ఒక మహిళా అధికారి అయ్యుండి ఆరోజు ఆమె చూపించిన డేరింగ్ చాలా మందిని షాక్‌కు గురి చేసింది.
ఆమె ధైర్యాన్ని అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. కానీ అలా ఉన్న అంజూ యాదవ్ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించిందంటూ అంజూ యాదవ్‌పై టీడీపీ నేతలు అరోపణలు చేశారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో ఓ హోటల్ నిర్వాహకురాలిపై విచక్షణా రహితంగా దాడి చేసింది ఈ సీఐ. ఆ తరువాత కొన్ని రోజులకు టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు జగన్ దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే వాళ్లపై చేయిజేసుకుని విమర్శలు ఎదుర్కొంది. రీసెంట్‌గా జనసేన నేతను కొట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే అంజూ యాదవ్ గురించి పూర్తిగా తెలిసినవాళ్లు మాత్రం ఎందుకు ఈమె ఇలా మారిపోయిందంటూ ఆశ్యర్యపోతున్నారు.
ఒకప్పుడు ఉన్న అంజూ యాదవ్, ఈమె ఒక్కరేనా అని షాకవుతున్నారు. సీఎం మీద ఎటాక్ జరిగిన టైంలో కూడా భయపడకుండా సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన పోలీస్.. ఇప్పుడు ఇలా తన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించడం నిజంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెచ్చినట్టే.