వెల్లంపల్లికి సిఐ మాస్ వార్నింగ్, సైలెంట్ అయిన మాజీ మంత్రి…!

  • Written By:
  • Publish Date - August 7, 2024 / 09:49 AM IST

మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న గన్నవరం విమానాశ్రయంలో చేసిన హడావుడి ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోవడంతో తన పార్టీ కార్యకర్తలతో వెల్లంపల్లి ఏకంగా నాలుగు కార్లతో గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. గత నెల 30న విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌ వద్ద జులై 30వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులను పక్కకు నెట్టేశారు.

ఆ ఘటన దృష్టిలో ఉంచుకున్న పోలీసులు అనుమతి లేని వాహనాలు, కార్యకర్తలను పోలీసులు విమానాశ్రయం బయటే కట్టడి చేసారు. వెల్లంపల్లి కారుని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. తన అనుచరుల కార్లను అనుమతించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన వెల్లంపల్లి పోలీసులతో గొడవకు దిగారు.

కారు దిగి కింద బైఠాయించి కాస్త హడావుడి చేసారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన సిఐ… ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తితే కేసు నమోదు చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనితో వెల్లంపల్లి వెనక్కు తగ్గారు. ఇక ఆయన చేసిన హడావుడితో విమానాశ్రయ ప్రయాణికులకు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనదారులు కాసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.