KCR AI: కేసీఆర్ ఏఐ లుక్‌ అదుర్స్‌.. కేసీఆర్‌ ఏఐ ఫొటోలు చూశారా..!

ఆదిపురుష్‌ ఏఐ లుక్‌తో ఇంటర్నెట్‌లో ఈ ఏఐ ఫొటోల పరంపర మొదలైంది. సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకూ ప్రతీ ఒక్కరూ తమ ఏఐ ఫొటోలు తయారు చేసుకుని ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫొటోలులు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 7, 2023 / 08:29 PM IST

KCR AI: అతి తక్కువ కాలంలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ప్రతీ ఒక్కరికీ దగ్గరయ్యింది. ప్రమాదం అంటూనే ప్రతీ ఒక్కరూ రోజు ఏదో ఓ రకంగా AI వాడేస్తున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆదిపురుష్‌ ఏఐ లుక్‌తో ఇంటర్నెట్‌లో ఈ ఏఐ ఫొటోల పరంపర మొదలైంది. సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకూ ప్రతీ ఒక్కరూ తమ ఏఐ ఫొటోలు తయారు చేసుకుని ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫొటోలులు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ సరికొత్త ఏఐ లుక్‌లో కేసీఆర్‌ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. బ్లాక్‌ బ్లేజర్‌, రేబాన్‌ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు మనం ఇచ్చే ఇన్‌పుట్స్‌ను బట్టి ఏఐ ఫొటోలు తయారు చేస్తుంది. నార్మల్‌గా కేసీఆర్‌ బయట ఇంత స్టైలిష్‌గా కనిపించరు. వైట్‌ డ్రెస్‌తో చాలా సింపుల్‌గా ఉంటారు. కానీ ఈ ఫొటోలు తయారు చేసినవాళ్లు మాత్రం కేసీఆర్‌ను ఓ హీరోలా తయారు చేశారు.

వెనకాల ఎన్‌ఎస్‌జీ గార్డ్స్‌ను పెట్టి ఒక రేంజ్‌లో ఫొటోను ఎలివేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఏఐ ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. కేసీఆర్‌ అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఈ ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. కింగ్‌ కేసీఆర్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు.