హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తుండడంతో.. తెలంగాణ రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. 2018లో అచ్చొచ్చిన ఫార్ములానే రిపీట్ చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే మరోసారి పార్టీ అధికారంలోకి రావాలంటే.. తన మార్క్ ఇమేజ్ మాత్రమే సరిపోదని కేసీఆర్‌కు తెలుసు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్, కేసిఆర్ ఇమేజ్.. బీఆర్ఎస్ పార్టీకి యూజ్ అయింది. ఈసారి మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. చేసిన పనుల ఆధారంగానే జనాలు తీర్పు ఇస్తారు. అలా అని కేవలం ప్రభుత్వ పనితీరును మాత్రమే గమనించే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎలా పని చేశారన్న దాని మీద కూడా జనాలు ఓ కన్నేసి ఉంచారు. వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు.. జనాలకు ఏం చేశారనేది ముఖ్యం.
జనాల నాడి ముందు కనిపెట్టిన కేసీఆర్.. ప్రజావ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన.. ఆ ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి కేసిఆర్ వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ముగ్గురు జంపింగ్ ఎమ్మెల్యేలకు కేసిఆర్ షాక్ ఇస్తారని తెలుస్తోంది. అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలకు! ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అయితే 4గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు. ఇప్పుడు వారిలో ముగ్గురికి సీట్లు ఇవ్వడం లేదని తేలింది. మొదట కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరావుని పక్కన పెడుతున్నారు. నెక్ట్స్ ఇల్లందులో హరిప్రియకు కూడా ఈసారి సీటు లేదని తేలింది. అటు వైరాలో రాములుని కూడా పక్కన పెట్టడం ఖాయమని తెలుస్తోంది.