KCR TOUGH FIGHT: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అందులో ఒకటి గజ్వేల్.. రెండోది కామారెడ్డి. ఈ రెండు చోట్లా బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి హేమాహేమీలైన ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి నిలబడ్డారు. కేసీఆర్‌ను ఓడిస్తామని ఇద్దరు నేతలూ చెబుతున్నారు. చెప్పడమే కాదు గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్ చూసి.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అలెర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రే వివిధ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లను చేర్చుకునే పనిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలను ప్రతిపక్షాలు సీరియస్‌గానే తీసుకున్నాయి. కేసీఆర్‌ను రెండు చోట్లా ఓడిస్తే.. బీఆర్ఎస్‌కు గట్టిగా చెక్ పెట్టొచ్చని నమ్ముతున్నాయి.
Revanth Reddy’s open letter : స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
కామారెడ్డిలో కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. రేవంత్, ఈటలకు సపోర్ట్‌గా రెండు పార్టీల్లోని కేంద్ర స్థాయి అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్ సభలో పాల్గొన్న మోడీ.. ఈటలకు భయపడి కేసీఆర్ వేరే చోట పోటీ చేస్తున్నాడు.. ఇక్కడ గెలిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పారిపోతాడని చెప్పారు. అయితే కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో.. కామారెడ్డి బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు కోసం కేటీఆర్ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అంతకంతకూ మారుతున్నాయి. BRSకు హ్యాట్రిక్‌పై ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. దాంతో ఈ రెండు నియోజకవర్గాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌లాగా ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరారు. పోల్ మేనేజ్‌మెంట్ చేస్తూ తన గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. అయితే గజ్వేల్‌లో ఈటల రాజేందర్.. ముదిరాజ్ సామాజిక వర్గమే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటున్నారు.
BARRELAKKA: బర్రెలక్క గెలిస్తే ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది..? సంచలనం సృష్టిస్తుందా..?
ఈ వర్గాల వారికి బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దక్కకపోవడంతో.. గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లేవీ కారు గుర్తుకు పడే అవకాశం లేదంటున్నారు. అందుకే ఇతర పార్టీలోఉన్న ముదిరాజ్ వర్గ లీడర్లను కారు ఎక్కించుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కులసంఘాల మీటింగ్స్ పెడుతున్నారు. కామారెడ్డిలోనూ బీఆర్ఎస్ జోరు పెంచింది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఆ వర్గం రేవంత్‌కే మొగ్గు చూపే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఈ నియోజకవర్గంలోని వివిధ కుల సంఘాలతో మీటింగ్స్ నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్.. బీసీ, మైనార్టీ, ఎస్టీ కుల సంఘాలతో ఇప్పటికే మీట్ అయ్యారు. కామారెడ్డి బైపాస్ రోడ్డుతో నష్టపోతున్న బాధితుల్లో కొందరు పోటీలో నిలబడ్డారు. దాంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేశామనీ.. రైతులపై పెట్టిన కేసులు కూడా తొలగిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి మాత్రం.. కేసీఆర్, రేవంత్ రెడ్డి.. ఇద్దరూ నాన్ లోకల్ అని, స్థానిక సమస్యలపై పోరాడిన తననే గెలిపించాలని కోరుతున్నాడు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేశారు.
ఆ తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకోవడంతో 2018లో కేసీఆర్‌ను ఢీకొట్టే ప్రత్యర్థి లేకుండా పోయారు. కానీ బూత్ లెవల్ నుంచి పార్టీ కార్యకర్తల అండ ఉండటంతో అక్కడ మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం బీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ఇక కామారెడ్డిలోనే ఓటమి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది బీఆర్ఎస్. మరోవైపు ప్రచారం చివరి రోజున గజ్వేల్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.