గతంతో కంపేర్ చేస్తే బీజేపీ.. భారీగా బలం పుంజుకుంది. కారు పార్టీకి.. ఈసారి గట్టి కాంపిటిషన్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. క్షేత్రస్థాయిలో బలం లేదు.. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు అని బీజేపీ గురించి బీఆర్ఎస్ నేతలు పైకి విమర్శలు చేస్తున్నా.. అసలు యుద్ధం కమలంతోనే అని వారికి కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ వైపు లిక్కర్ ఎపిసోడ్, మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారం.. వీటిపై బీజేపీ సమరం సైరెన్. దీంతో బీఆర్‌ఎస్, కేసీఆర్ మరింత అలర్ట్ అయ్యారు. దీంతో పక్కా ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.
ప్రణాళిక ప్రకారం వ్యూహాలు రచిస్తే తప్ప.. బీఆర్‌ఎస్ గట్టెక్కే పరిస్థితులు లేవనేది చాలామంది అభిప్రాయం. మారుతున్న రాజకీయ సమీకరణాల ఆధారంగా కేసీఆర్ ఎలాంటి వ్యూహలు రచించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరం. సిట్టింట్ ఎమ్మెల్యేలు అందరికి టికెట్ ఖాయం అని ఆయన ప్రకటన.. సొంత పార్టీలోనే టెన్షన్ పెడుతోంది. సిట్టింగ్‌ల్లో చాలామందిపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది మరి ! ఐతే దీని వెనక కూడా కేసీఆర్ భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం మొండిచేయి చూపించినా.. వారంతా పక్క పార్టీలవైపు చూస్తే చాన్స్ ఉంది. కొత్తవారికి ఆయా నియోజకవర్గాల్లో ఎంతమేర పట్టు ఉందనేది తెలియదు. దీంతో రిస్క్ చేయకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇది పక్కా కేసిఆర్ ఎలక్షన్ స్ట్రాటజీ అన్నది మరికొందరి అభిప్రాయం. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ డోర్లు తెరిచిన బీజేపీ, కాంగ్రెస్‌కు ఇది ఒకరకంగా షాక్‌లాంటిదే ! వచ్చి చేరేవాళ్లు పెద్దగా కనిపించరు ఇకమీద ! కాంగ్రెస్‌ను పక్కనపెడితే.. చేరికల మీదే బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. దానికోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి.. ఈటలకు బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి సమయంలో.. ఒక్క పార్టీ ఎమ్మెల్యే, నేత కూడా జారిపోకుండా.. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు.. బీజేపీ, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేలానే ఉన్నాయన్నది క్లియర్.