Ponguleti Srinivasa Reddy: పొంగులేటి స్పీడ్‌కు కేసీఆర్‌ బ్రేకులు వేస్తున్నారా..?

పొంగులేటి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు గులాబీ బాస్.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావును బీఆర్‌ఎస్ వైపు ఆకర్షించారు. కే‌టి‌ఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావ్ గులాబీ కండువా కప్పుపున్నారు. ఇది పొంగులేటికి భారీ షాక్ అనే చెప్పాలి.

  • Written By:
  • Publish Date - August 18, 2023 / 07:12 PM IST

Ponguleti Srinivasa Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను ఒక్క సీటు కూడా గెలవనిచ్చేది లేదని హస్తం గూటికి చేరిన పొంగులేటిపై కేసీఆర్‌ ప్రత్యేకంగా గురి పెట్టారా..? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగులేటి స్పీడ్‌కు బ్రేకులు వేయాలని డిసైడ్ కేసీఆర్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పేరు చెప్తే చాలు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటికాలు మీద లేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని.. ప్రతీసారి చెప్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనాల్లో పొంగులేటికి మంచి ఆదరణ ఉంది. అందుకే ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో తాను సూచించిన అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా పొంగులేటి సూచించిన వారికే టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పొంగులేటి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు గులాబీ బాస్.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావును బీఆర్‌ఎస్ వైపు ఆకర్షించారు. కే‌టి‌ఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావ్ గులాబీ కండువా కప్పుపున్నారు. ఇది పొంగులేటికి భారీ షాక్ అనే చెప్పాలి. ఇది తెల్లంతోనే ఆగేలా లేదు. త్వరలో ఖమ్మం జిల్లాకు చెందిన మరికొంతమంది నేతలు, పొంగులేటి అనుచరులపై కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని భావించిన పొంగులేటికి.. గులాబీ బాస్ రివర్స్ ప్లాన్స్ గట్టిగా దెబ్బ తీస్తున్నాయనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ బాగానే సత్తా చాటింది. అందుకే ఈసారి ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలని కే‌సి‌ఆర్‌ భావిస్తున్నారు. ఐతే పొంగులేటి కారణంగా బీఆర్‌ఎస్‌కు ఇక్కడ మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా పొంగులేటిని దెబ్బ తీసేందుకు కే‌సి‌ఆర్.. పొంగులేటి అనుచరులకు గాలం వేస్తునట్లు తెలుస్తోంది. ఐతే పొంగులేటి కూడా తగ్గేదేలే అంటున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ నేతలను ఆకర్షించేందుకు తన వ్యూహాలకు పదును పెంచుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది.