BRS: 115 మందిలో 25మంది ఔట్.. ఫస్ట్‌ లిస్ట్‌లో మార్పు.. కేసీఆర్‌ ప్లాన్‌ ఏంటి?

రాజకీయ పరిణామాలు మారుతున్న వేళ.. అదే మాట నిజం కాబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 115మంది అభ్యర్థుల్లో కనీసం 25మందిని మార్చే చాన్స్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు జమిలి అని ప్రచారం జరుగుతున్న వేళ.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 02:59 PM IST

BRS: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు భగ్గుమంటున్నాయ్. ఇప్పటికే బీఆర్ఎస్‌ ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. కాంగ్రెస్‌, బీజేపీ కూడా రేపోమాపో అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయ్. తుక్కుగూడలో కాంగ్రెస్‌, పెరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ సభలతో రాజకీయం హీటెక్కగా.. వరుస ప్రారంభోత్సవాలు, సభలతో కేసీఆర్‌ మరింత అగ్గి రాజేస్తున్నారు. హ్యాట్రిక్‌ అధికారమే లక్ష్యంగా కారు పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. బీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయ్. దీంతో రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఫస్ట్ లిస్ట్‌ ప్రకటించినప్పుడు.. కేసీఆర్‌ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన.. మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని ఓ మాట అలా వదిలేశారు.

ఐతే రాజకీయ పరిణామాలు మారుతున్న వేళ.. అదే మాట నిజం కాబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 115మంది అభ్యర్థుల్లో కనీసం 25మందిని మార్చే చాన్స్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు జమిలి అని ప్రచారం జరుగుతున్న వేళ.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. దీంతో కొంతమంది అభ్యర్ధులని మార్చడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరో 4స్థానాలకు బీఆర్ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు కాంగ్రెస్‌, బీజేపీ ఇంకా అభ్యర్ధుల ఎంపిక దగ్గరే ఆగిపోయింది. వారికంటే బీఆర్ఎస్‌ ముందుంది. ఐతే జమిలి ఎన్నికలు లేదా కనీసం లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఎలాగో లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో జరగనున్నాయ్. వాటితో పాటే ఈ డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మిజోరం ఎన్నికలని కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారని ప్రచారం ఉంది.

ఎన్నికలు వెనక్కి వెళితే.. కేసీఆర్‌ కొంతమంది అభ్యర్ధులని మారుస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే అభ్యర్ధులని ఫిక్స్ చేయడం వల్ల కొందరిపై వ్యతిరేకత వస్తుంది. కొందరు ఏమో సీట్లు రాక వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో మరీ నెగిటివ్ అవుతుందని చెప్పి కే‌సి‌ఆర్ కొన్ని సీట్లలో అభ్యర్ధులని మారుస్తారని కథనాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఇదంతా ఉత్త ప్రచారం అని బీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయ్. ముందు ప్రకటించిన లిస్ట్‌లో ఎలాంటి మార్పులు లేవనే అంటున్నారు. ఐతే మైనంపల్లి హనుమంతరావు లాంటి వారు పార్టీ మారితే.. ఆ సీటులో ఏమైనా మార్పు రావచ్చు తప్ప దాదాపు లిస్ట్ మాత్రం చేంజ్ కాదని చెప్తున్నారు.