CM KCR: కేసీఆర్‌కు కష్టమే! కామారెడ్డిలో కేసీఆర్‌కు షాక్‌ తప్పదా..?

గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీకి సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్న ఆసక్తికి మించి.. కామారెడ్డిలో సీఎం పరిస్థితి ఏంటి అనే డిస్కషన్‌ జోరుగా సాగుతోంది. కామారెడ్డి మీద పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలంతా అక్కడ పర్యటిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 02:41 PM IST

CM KCR: తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా కనిపించిన రాజకీయం.. ఇప్పుడు భగ్గుమంటోంది. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. బీఆర్ఎస్ ఇప్పటికే లిస్ట్ ప్రకటించగా.. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో.. బీజేపీ, కాంగ్రెస్‌ కూడా జాబితా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయ్. ఎవరు ఎక్కడి నుంచి పోటీ.. ఎవరి మీద ఎవరు పోటీ అని.. ఇలా రకరకాల చర్చ జరుగుతున్న వేళ.. తెలంగాణ రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయ్.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో లేదో.. ఇప్పుడో కొత్త చర్చ స్టార్ట్ అయింది. అదే కేసీఆర్ గురించి..! గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీకి సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్న ఆసక్తికి మించి.. కామారెడ్డిలో సీఎం పరిస్థితి ఏంటి అనే డిస్కషన్‌ జోరుగా సాగుతోంది. కామారెడ్డి మీద పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలంతా అక్కడ పర్యటిస్తున్నారు. జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే కాంగ్రెస్‌, బీజేపీ నుంచి కేసీఆర్‌కు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బీజేపీ నుంచి మాజీ జడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయం అయింది. ముగ్గురు బలమైన నేతలు కావడంతో.. కామారెడ్డిలో జరగబోయే ఎన్నికలు ఉత్కంఠ రేపబోతున్నాయ్. గజ్వేల్‌లానే కామారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని బీఆర్ఎస్‌ నేతలు అంటుంటే.. దీనికి కాంగ్రెస్‌, బీజేపీ నేతలు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. గజ్వేల్ అభివృద్ధి ఏమో కానీ.. వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని.. ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి ఏంటో జనాలకు చూపించాలంటూ బీజేపీ నేత వెంకటరమణారెడ్డి.. చలో గజ్వేల్ కార్యక్రమానికి పిలుపునివ్వగా, దానిని ఒకరోజు ముందే.. పోలీసులు అడ్డుకుని, వెంకటరమణా రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు అంతా రంగంలోకి దిగడంతో వెంకటరమణారెడ్డిని విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.. ఈ మధ్య వాహనాల్లో గజ్వేల్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటనే దానిపై జనాల్తో మాట్లాడారు. ఇక అటు షబ్బీర్‌అలీ మీద జనాల్లోనూ సింపథీ ఉంది. అంతెందుకు మన డయల్‌న్యూస్ చేపట్టిన పబ్లిక్ సర్వేలోనూ చాలామంది కాంగ్రెస్‌కు అనుకూలంగానే రియాక్ట్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్. కామారెడ్డి జనాల తీర్పు ఎలా ఉంటుంది..? కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవా..? అనే చర్చ జరుగుతోంది.